
నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోగా నటిస్తున్నాడు . అయితే సినిమారంగంలో ఓ స్టార్ హీరోగా వెలుగొందాలని ఆశించాడు కానీ ఆ ఆశ నెరవేరలేదు దాంతో గమ్మున ఉండకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు . మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానని , ఆ తర్వాతే రాజకీయాల గురించి ఆలోచిస్తానని చెప్పాడట బాలయ్య బాబాయ్ కి . తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులు వచ్చాయి , దాంతో పార్టీని బ్రతికించడం కోసం బాలయ్య , చంద్రబాబు లు కష్టపడుతున్నారు . అందులో భాగంగానే కళ్యాణ్ రామ్ ని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లేదా కూకట్ పల్లి తదితర ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమని కోరితే నిరాకరించాడట . గ్రేటర్ హైదరాబాద్ లోని 28 నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది , గత ఎన్నికల్లో గ్రేటర్ లోనే 11 స్థానాల్లో టిడిపి గెలిచింది . ఈసారి కూడా టిడిపి పట్టు కోసం కాంగ్రెస్ తో జతకట్టి మహాకూటమిగా ఏర్పడి పోటీకి పలు అభ్యర్థులను నిలబెడుతోంది .
English Title: Nandamuri kalyan ram rejected balakrshna’s offer
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PBdSmc
Comments
Post a Comment