హ్యాయ్ ల్యాండ్ కి అగ్రిగోల్డ్ కి అస్సలు సంబంధం లేదని సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు హ్యాయ్ ల్యాండ్ నిర్వాహకులు. ప్రజల సొమ్ము బాగా తినమరిగిన అగ్రిగోల్డ్ , హ్యాయ్ ల్యాండ్ పెత్తందారులు చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని సరికొత్త వాదన వినిపిస్తున్నారు. అగ్రిగోల్డ్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలొనే కాకుండా కర్ణాటక , తమిళనాడు ప్రజలను కూడా నిట్టనిలువునా ముంచారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి ప్రజలను మోసం చేసి హ్యాయ్ ల్యాండ్ పేరుతో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు టాలీవుడ్ అనే శాటిలైట్ ఛానల్ ని కూడా నిర్వహిస్తున్నారు.
బాహ్య ప్రపంచానికి హ్యాయ్ ల్యాండ్ , అగ్రిగోల్డ్ , టాలీవుడ్ ఛానల్ అంతా ఒక్కటేనని తెలుసు . అందుకే నాలుగేళ్ళ క్రితం మొదలైన ప్రభుత్వ చర్యలు ఓ కొలిక్కి వస్తున్నాయి అని తెలిసి, కోర్టు కూడా సీరియస్ గా ఉందని పసిగట్టిన దొంగల ముఠా చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని హ్యాయ్ ల్యాండ్ కు అగ్రిగోల్డ్ కు సంబంధం లేదు కాబట్టి హ్యాయ్ ల్యాండ్ ఆస్థులను జప్తు చేయడానికి , అమ్మడానికి హక్కు లేదు అంటూ కోర్టుని వేడుకున్నారు. ఇన్నాళ్లు అగ్రిగోల్డ్ వ్యవహారంలో హ్యాయ్ ల్యాండ్ ఆస్థులను స్వాధీనం చేసుకున్నప్పుడు , వేలం వేసి ప్రజలకు ఆ సొమ్ముని పంచుతామని కోర్టు తెలిపినప్పుడు మిన్నకుండి ఇప్పుడేమో చావు తెలివితేటలు చూపిస్తున్నారు. అసలు హ్యాయ్ ల్యాండ్ కి అగ్రి గోల్డ్ కి సంబంధం లేదని అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత దయనీయంగా ఈ కేసు పట్ల వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అగ్రిగోల్డ్ లో పెట్టుబడులు పెట్టి , వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు కానీ ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు లేదు. దొంగల ముఠాకు సహకరించేలా చర్యలు ఉంటున్నాయి మరి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ds9krM
Comments
Post a Comment