క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఒక్కో గెటప్ ని ఒక్కోరకంగా రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో బిజినెస్ పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది ఈ చిత్రం . నందమూరి బాలకృష్ణ చిత్రానికి ఓవర్ సీస్ లో పెద్దగా డిమాండ్ ఉండదు . 3 లేదా నాలుగు కోట్లు పలికితే అదే గొప్ప కానీ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఎంతకు పోయిందో తెలుసా ……. 20 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రెండు పార్ట్ లు కలిపి 20 కోట్లకు బేరం కుదిరినట్లు తెలుస్తోంది . అంటే అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్న వాళ్ళతో పోల్చితే చాలా ఎక్కువ . అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ పై ఉన్న క్రేజ్ ఒక కారణం కాగా మరో కారణం ఏంటో తెలుసా …….. ఎన్టీఆర్
అవును ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కాబట్టి ఆయన చరిత మరోసారి ఇప్పటి తరానికి కూడా తెలియాలి కాబట్టి అలాగే ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతీ భారతీయుడికి , అందునా ప్రతీ తెలుగువాడికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవం కాబట్టి అంతటి సాహసం చేసారు . భారీ రేటుకి కొన్నప్పటికి అది రికవరీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుంది . రెండో పార్ట్ కూడా జనవరిలోనే అనుకుంటున్నారు కానీ ఏమైనా మార్పులు ఉండొచ్చు అని తెలుస్తోంది .
English Title: Mind blowing business for NTR biopic overseas rights
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pzdy7n
Comments
Post a Comment