Skip to main content

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే హీరో.. ‘‘లా’’ ట్రైలర్ లాంచ్ వేడుకలో కమల్ కామరాజ్

law trailer launchకాన్సెప్ట్ ఓరియెంటడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్ లో ‘లా’ మూవీ ఆ ట్రెండ్ ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి

చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా

రాజ్ కందుకూరి మాట్లాడుతూ:
‘‘కమల్ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. సినిమా పై అతనికుండే అభిరుచి నాకు బాగా తెలుసు. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
‘ లా ’ అంటే కోర్ట్ రూం డ్రామా అనుకున్నాను. కానీ ట్రైలర్ నన్ను సర్ ప్రైజ్ చేసింది. కాప్ లుక్స్ లో కమల్ చాలా బాగున్నాడు. మంచి విజయం సాధించాలను

కోరుకుంటున్నాను ’’ అన్నారు.

 

హీరోయిన్ మౌర్యాణి మాట్లాడుతూ:
‘‘నేను చాలాఇష్టపడి చేసిన మూవీ అలాగే చాలా కష్టపడి చేసిన మూవీ కూడా. ట్రైలర్ నన్ను ఒక ఆడియన్ గా ఇంప్రెస్ చేసింది. నాకు ఇలాంటి కథలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గగన్ కి థ్యాంక్స్. స్టోరీ చెప్పినప్పుడు బాగుంది అనుకున్నాను. కానీ నాకు ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా నా అంచనాలను మించి ఉంది. కమల్ అందించిన సహాకారం మర్చిపోలేను, పూజా మంచి ప్రెండ్ నాకు తనతో వర్క్ చేయడం నా నటనకు చాలా హెల్ప్ అయ్యింది.’’ అన్నారు.

పూజా రామచంద్రన్ మాట్లాడుతూ:

‘‘ఢిపరెంట్ క్యారెక్టర్స్ చేయడం నాకు చాలాఇష్టం. నాకు ఇలాంటి రోల్ ఇచ్చిన దర్శకుడు గగన్ కి చాలా థ్యాంక్స్. చేసే పాత్రలు ఛాలెజింగ్ గా ఉంటే నాకు ఇష్టం. అలాంటి రోల్ లో మీకు ఇందులో కనిపిస్తాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. టాలీవుడ్ నాకు చాలా మంచి మెమరీస్ ని ఇచ్చింది.

నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ లు లేవు. కమల్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

 

దర్శకుడు గగన్ గోపాల్ ముల్కా మాట్లాడుతూ:
‘‘ హీరో కమల్ అందించిన సహాకారం మరిచిపోలేను. హీరోగానే కాదు కథ బాగా రావడానికి నా వెనక ఒక బలంగా మారి నడిపించారు. హీరోయిన్స్, మౌర్యాణి, పూజా

గారు అందించిన సహాకారం తో 30 డేస్ లో కంప్లీట్ చేయగలిగాం. ఇది కంప్లీట్ విజయవాడ లో రూపొందించిన మూవీ, సాంగ్స్ కూడా అక్కడే చేసాం. నిర్మాత రమేష్ గారు ఎప్పుడూ కథ గురించే ఆలోచించేవారు, ఖర్చు కోసం ఎక్కడా ఆలోచించలేదు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి బాగోపోతే వందమందికి చెప్పండి కానీ దయచేసి సినిమా ని చూడండి ’’ అన్నారు.

హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ:
‘‘ ఏదైనా పండుగ చేసే కునే ముందు ఊరెగింపు తో మొదలు పెడతాం. ఇప్పుడు మా ట్రైలర్ తో మేము సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడం మొదలు పెట్టాం ఇకపై అంతా బాగుంటుందని నమ్ముతున్నాను. హీరోగా మళ్ళీ రీ లాంచ్ అంటున్నారు అవేమీ నేను పెద్దగా నమ్మను. ఈ సినిమాలో మొదటి హీరో స్ర్కీన్ ప్లే అదే మమ్మల్ని సినిమా చేసేందుకు మందుకు తీసుకొచ్చింది. మీరు ఇలాంటి స్ర్కీన్ ప్లే లు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను. తర్వాత పూజ, మౌర్యాణి పాత్రలు ఈ సినిమా కథను డ్రైవ్ చేస్తాయి. ప్రతి ఒక్కరు ‘లా’ ని ఫాలోచేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ ని ఫాలో అయినట్లే. ఈ రోజు వచ్చిన ట్రెండ్ ఆఫ్ మూవీ స్ లో చాలా మార్పులు చూస్తున్నాం. ఇది ఎక్స్ ట్రీమ్ థ్రిలర్ గా మీ ముందుకు వస్తుంది. ప్రమోషన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను’’ అన్నారు.

నవంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దం అవుతున్న ‘లా’ చిత్రంలో పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.

 

లా( లవ్ అండ్ వార్)

ఆర్టిస్ట్స్ :

1. కమల్ కామరాజ్

2. మౌర్యాణి

3.పూజా రామచంద్రన్

4.మంజు భార్గవి

5. ఛత్రపతి శేఖర్

6. రవి మల్లేడి

7. క్రిష్ఱమూర్తి

8. వానపల్లి పెద్దిరాజు

9.నవనీత్

10.అవంతిక

టెక్నిషియన్స్:

1.లిరిక్స్: పూర్ణశర్మ, కరణాకర్

2.ఆర్ట్ : నూరిశెట్టి ఉత్తమ్ కుమార్.

3. కొరియోగ్రఫి: రాజ్ పైడి

4.ఫైట్స్: డ్రాగెన్ ప్రకాశ్

5.ఎడిటింగ్: ఎస్. ఎస్. సుంకర

6.కెమెరామెన్: పి. అమర్ కుమార్

7. మ్యూజిక్: సత్య కశ్యప్

8. పి ఆర్ ఓ : జి యస్ కె మీడియా
ప్రొడక్షన్ కంట్రోలర్ : కామిరెడ్డి బాబు రెడ్డి
సహానిర్మాత : మద్దిపాటి శివ, నిర్మాత : రమేష్ బాబు మున్నా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: గగన్ గోపాల్ . ముల్క



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2F6qIFb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...