Skip to main content

`స్వ‌యంవ‌ద` టైటిల్ ఆవిష్క‌ర‌ణ‌

swayam vedha movie title announcementఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్ర టైటిల్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అల్లాణి శ్రీధ‌ర్ చిత్ర `స్వ‌యం వ‌ద‌` అనే చిత్ర టైటిల్ ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్క‌రించారు.

అనంత‌రం అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ, `వివేక్ మంచి రైట‌ర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయ‌న నాతో క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడే నాకు విష‌యం అర్ధ‌మైంది. యువ‌త ఆత్మ‌గౌరం కోసం ఎలా పోరాడింది? అన్న‌దే క‌థ‌. మంచి యూనిక్ స‌బ్జెక్ట్ ను ఎంచుకుని సినిమా చేస్తున్నాడు. క‌థ‌ను చ‌క్క‌గా క‌మ‌ర్శిలైజ్ చేసాడు . త‌ప్ప‌కుండా సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా` అని అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ` సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వివేక్ గురువు త‌గ్గ శిష్యుడ‌ని టైటిల్ ను బ‌ట్టే తెలుస్తోంది. ఇదో డిఫ‌రెంట్ మూవీ. ఇలాంటి క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేయాలంటే నిర్మాత కూడా అంతే ఫ్యాష‌న్ గా నమ్మాలి. రాజా గారు క‌థ‌ను ఎంత బ‌లంగా న‌మ్మి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. `గౌత‌మ బుద్ధ` సినిమా టైమ్ లోనే వివేక్ నాకు ప‌రిచ‌యం. అప్ప‌టి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ వ‌ర్మ మాట్లాడుతూ, `అల్లాణి శ్రీధ‌ర్ గారి వ‌ద్ద 15 ఏళ్లు ప‌నిచేసాను. రాజ్ కందుకూరి గారి ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసి చాలా విష‌యాలు తెలుసుకున్నా. ఏ.వి.ఏన్ సుబ్బారావు గారు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో ముందుకు వెళ్తున్నాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే స్వ‌యం వ‌ద` అనేది సాంస్కృతి ప‌దం. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. తన గురించి తానే ఓ స‌ర్వ‌స్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్ప‌బోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెట‌ప్స్ లో క‌నిపిస్తుంది. అన్ని గెట‌ప్స్ లోనే డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఇస్తూ అనికారావు చ‌క్క‌గా న‌టించింది. ఆ పాత్ర కోసం 35 మందిని చూసి చివ‌రికి అనికా ను ఎంపిక చేసుకున్నాం. హీరో కూడా చ‌క్క‌గా న‌టించాడు. ఇలాంటి క‌థ‌ను ఒకే వేలో చెబితో బోర్ కొడుతుంది. అందుకే కామెడీ, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించాం. టెక్నిక‌ల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. ఒక‌ పాట షూటింగ్ మిన‌హా అంతా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి` అని అన్నారు.

హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ, ` ఇదొక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. డైరెక్ట‌ర్ గారు క‌థ చ‌ద‌వ‌మ‌ని ఇచ్చారు. చ‌దివిన వెంట‌నే సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్ స్ వ‌చ్చాయి. సినిమా త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది` అని అన్నారు.

హీరోయిన్ అనికారావు మాట్లాడుతూ, ` కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి వైవిథ్య‌మైన సినిమాలో న‌టిచండం అదృష్టంగా భావిస్తున్నా. నాతో మంచి పాత్ర చేయించారు. మా ద‌ర్శ‌కుడు అనుకున్న విధంగా న‌టించాన‌ని అనుకుంటున్నా. ఒకేసారి ఆరు షేడ్స్ ఉన్న రోల్స్ చేయ‌డం ఛాలెంజింగ్ గా అనిపించింది` అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ జ‌గ‌న్, లోహిత్ కుమార్ , చ‌క్ర‌పాణి త‌దితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృస్‌న ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2r0fSXj

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...