Skip to main content

‘RX 100’ ఫేంకార్తికేయ హీరోగా ”హిప్పీ” షూటింగ్ ప్రారంభం

karthikeya HIPPY movie openingRX 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ శుక్రవారంహైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు .

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ” RX 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఆ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలుసు. కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత, బ్యానర్‌లో నటించడం, అలాంటి ప్రొడ్యూసర్‌తో నా కెరీర్ ఆరంభంలో రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను” అని అన్నారు.

దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ..” దర్శకుడిగా నాకు తెలుగులో తొలి స్ట్రెయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం ఛాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ఇది . ఈ చిత్రానికి ఆర్ డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది” అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఆర్‌డీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ”సూర్య, జ్యోతికతో కృష్ణ రూపొందించిన నువ్వు నేను ప్రేమ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. ఈ సినిమా కోసం మళ్ళీ అతడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. కృష్ణ‌ ఎనర్జిటిక్ డైరెక్టర్. హిప్పీ క్రేజీ టైటిల్. కథ చెప్పినప్పుడు వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోదామనిపించింది. ఎందుకంటే నాకు కథ అంత బాగా నచ్చింది. గతంలో నేను తెలుగులో హ్యాపీ, ఘర్షణ చిత్రాలకు పనిచేశాను. మళ్లీ హిప్పీ కి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హీరో కార్తీకేయ అనగానే ఆయన నటించిన ఆర్‌ఎక్స్ 100 చూశాను. కార్తీకేయకు ఈ కథ చక్కగా సరిపోతుంది. సరైన కథకు సరైన హీరో లభించాడు. కార్తికేయ అనగానే సగం సక్సెస్ సాధించినంత ఫీలింగ్ కలిగింది. కార్తికేయ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయం. పక్కాగా రూపొందిన పూర్తి స్క్రిప్టు‌ను లాక్ చేశాం. హైదరాబాద్‌తోపాటు శ్రీలంక మరికొన్ని లోకేషన్ల లో షూట్ చేస్తాం” అని అన్నారు.

నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ”హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది. కార్తికేయ కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు .

నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్
క్యాస్టూమ్: ప్రవీణ్
మేనేజర్లు: గోపి, ఏపీ పాల్ పా0డి
పీఆర్‌వో: పులగం చిన్నారాయణ
డిజైన్లు: తండోరా



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AWX80z

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...