వినయ విధేయ రామ చిత్రం పది రోజుల్లో మొత్తం 60 కోట్లకు పైగా షేర్ సాధించింది . సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైంది వినయ విధేయ రామ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటించగా కీలక పాత్రల్లో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ లు నటించగా విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు . ఈ సినిమాకు మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది అయితే మాస్ సినిమా కావడంతో వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి . అయితే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నప్పటికీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం బాగానే నష్టపోతున్నారు .ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 12 . 50 కోట్లు
సీడెడ్ – 11. 55 కోట్లు
ఉత్తరాంధ్ర – 8. 05 కోట్లు
కృష్ణా – 3. 56 కోట్లు
గుంటూరు – 6. 26 కోట్లు
ఈస్ట్ – 5. 23 కోట్లు
వెస్ట్ – 4. 25 కోట్లు
నెల్లూరు – 2. 77 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 5. 35 కోట్లు
ఓవర్ సీస్ – 1. 40 కోట్లు
మొత్తం – 60. 92 కోట్లు
English Title: Vinaya Vidheya Rama Ten Days Worldwide Collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FIk1bV

Comments
Post a Comment