Skip to main content

ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సకలకళావల్లభుడు” ఫిబ్రవరి 1న విడుదల.

Family entertainer Sakalakala Vallabhudu movie to release on 1st Feb  బీరం సుదాకరెడ్డి సమర్పణలో సింహా ఫిలిమ్స్, మరియు దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సకల కళా వల్లభుడు‘.   తనిష్క్ రెడ్డి,మేఘ్లా ముక్తా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శివగణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 న విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ నేపథ్యంలోనే  చిత్రనిర్మాతలు అనిల్, శ్రీకాంత్  మాట్లాడుతూ  యాక్షన్,కామెడీ లతో పాటు ఫ్యామిలీ  ఎంటర్ టైనర్ గా  ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రానికి హీరో పెర్ఫార్మన్స్,కథ,కధనాలు హైలెట్ గా నిలవనున్నాయు.  సినిమాలో నటించిన ఏ ఒక్కరూ కొత్త వారిలా అనిపించరు. అంత అద్భుతంగా పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక హీరో తనిష్క్ రెడ్డి అయితే ఆయనలో ఉన్న ప్రతి టాలెంట్ ను టైటిల్ కు తగ్గట్టు బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఫ్యూచర్ లో బిగ్ స్టార్ అవుతాడు. అతనితో మరిన్ని సినిమాలు చేయలనుకుంటున్నాము. మా సకల కళా వల్లభుడి  సినిమాకు బి సి, నైజాం, సీడెడ్ లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.   అన్నారు.

 

 

చిత్ర దర్శకుడు శివ గణేష్ మాట్లాడుతూ సినిమా చాలా బాగొచ్చింది. సినిమా చేసాక కంటే చూసుకున్న తరువాత చాలా సంతృప్తి తో ఉన్నాను.. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంతబాగా వచ్చేది కాదు. హీరో తనిష్క రెడ్డి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 2019 లో తప్పకుండా హిట్ సినిమా అవుతుందని అన్నారు.  హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ… సినిమా కథలో కంటెంట్ ఉంటే ఆదరించి సపోర్ట్ చేసే  సినిమా పెద్దలు చాలా మందే ఉన్నారు. అలా మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తే.. బీరం సుధాకర్ రెడ్డి గారు. ఆయనకు మా నిర్మాతలు అనిల్, శ్రీకాంత్ లు తోడై ఖర్చుకు వెంకడకుండా రిచ్ గా తెరకెక్కించారు. ఇక డైరెక్టర్ శివ తో పాటు మిగతా వారు కూడా వారి వారి డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి కష్టపడ్డారు. టెక్నీషియన్స్ విజయ్, నాని, ధర్మేంద్ర లు బెస్ట్ వర్క్ ను అందించారు. క్వాలిటీ కోసం ఎక్కువగా కష్టపడ్డారు. ఇక మ్యూజిక్ అందించిన అజయ్ నాకు కాంపిటీషన్ గా నిలిచారు. 4 సాంగ్స్, 4 ఫైట్స్, కామెడీ ఇలా అన్నీ ఆదరగొట్టేశారు. వంద థియేటర్లలో సినిమా విడుదల కానుంది. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

 

నటుడు రాజేంద్ర కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, నటి అలెక్సా, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

తనిష్క్ రెడ్డి,మేఘ్లా  ముక్తా,సుమన్,పృథ్వి,జీవా,చిన్నా,అపూర్వ,శృతి,విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్,సంగీతం:అజయ్ పట్నాయక్,ఎడిటింగ్: ధర్మేంద్ర,పి ఆర్ ఓ: బి.వీరబాబు,సమర్ఫణ బీరం సుధాకర్ రెడ్డి,నిర్మాతలు: అనిల్,త్రినాధ్,కిషోర్,శ్రీకాంత్ ,కథ స్క్రీన్ ప్లే ,మాటలు దర్శకత్వం: శివ గణేష్.

English Title: Family entertainer Sakalakala Vallabhudu movie to release on 1st Feb

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ME1Pkf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...