మెగా హీరో వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఇటీవలే ప్రారంభమైన వాల్మీకి చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లనే లేదు అప్పుడే ఆ సినిమాని వివాదాలు చుట్టుముడుతున్నాయి . వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో కు రివాల్వర్ ని యాడ్ చేయడమే ఈ వివాదానికి కారణం అయ్యింది . వాల్మీకి మనోభావాలను కించపరిచేలా టైటిల్ ని పెట్టారని , వెంటనే వాల్మీకి కులస్థులకు క్షమాపణ చెప్పి ఆ టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు వాల్మీకి కులస్థులు .ఇటీవలే పలు చిత్రాల టైటిల్స్ పై అలాగే సన్నివేశాలపై పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి . తాజాగా వాల్మీకి చిత్రానికి వివాదం అంటుకుంది . ఈ సినిమా ఇప్పుడే ప్రారంభం అయ్యింది మరి . ఈ వివాదం సద్దుమణుగుతుందా ? లేక మరింత పెద్దది అవుతుందా ? చూడాలి . అలాగే వాల్మీకి కులస్థులు డిమాండ్ చేసినట్లుగా క్షమాపణ చెబుతారా చూడాలి .
English Title: Controversy on Valmiki title
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G7qooe

Comments
Post a Comment