శేఖర్ మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఎస్.నిర్మంచిన చిత్రం ఈ2మనసులు.ఆది పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీసెంటిమెంట్‌తో తెరకెక్కుతుంది. రవిచంద్ర, సుమయ కథానాయకులుగా పరిచమవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ 70శాతం పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని సమ్మర్‌లో ఈ 2 మనసులు కూల్‌గా మీ ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఫిలింఛాంబర్‌లో టీజర్ మరియు సాంగ్‌ను విడుదల చేశారు. విలేకరుల సమావేశంలోచిత్ర దర్శకుడు మాట్లాడుతూ… ఈ సినిమాలో నాతమ్ముడు సత్య నాకు చాలా హెల్ప్ చేశారు. స్ర్కిప్ట్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌గారికి మేము రుణపడి ఉంటాము. ఇది ఒక లవ్ స్టోరీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్ళు అయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టోరీ రెడీ అయ్యాక మేం చాలా మంది పెద్ద హీరోల వద్దకు వెళ్ళి అడిగితే ఎవ్వరూ మాకు డేట్స్ ఇవ్వలేదు. అందరూ బ్యానర్ ఏంటి, సినిమా వస్తదా లేదా అని అడుగుతున్నారు. దీంతో అందరూ కొత్తవాళ్ళనే తీసుకున్నాం. ఎప్పటికైనా ఇది చాలా పెద్ద బ్యానర్ అవుతుందని ఆశిస్తున్నాను. మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తేనే మంచి కథలతో మీ ముందుకు రాగలము అని అన్నారు.
హీరో మాట్లాడుతూ… ఈ మధ్య వచ్చిన లవ్‌స్టోరీస్ కి చాలా భిన్నంగా ఉంటుంది ఈ చిత్రం. తప్పకుండా మా సినిమాని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. నాకు మా డైరెక్టర్ గారు అంతా దగ్గరుండి చెప్పి చెయించుకున్నారు. మా నుంచి ఆయనకు ఎటువంటి నటన కావాలో అది ఆయన రాబట్టుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. రవిచంద్ర, సుమయ, రంగి, మహేష్, కాందంబరికిరణ్, తిరుపతి, జావెద్, సతీశ్, కిరణ్, మౌనిక, జనతాసురేష్, పూజానాయుడు నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ఃచంద్రశేఖర్ ఎస్., డైరెక్టర్ఃఆదిపినిశెట్టి, కెమెరామెన్ఃనందన్‌కృష్ణ, మ్యూజిక్‌డైరెక్టర్ఃజి.వి.ఎం.గౌతమ్, బ్యానర్ఃశేఖర్ మూవీస్, ఎడిటర్ఃఎన్.మల్లేశ్‌బాబు, ఆర్ట్‌డైరెక్టర్ఃరామ్‌రమేష్, లిరిక్‌రైటర్ఃసాంబ అనిశెట్టి.
English Title: Ee 2 Manasulu movie teaser released
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2sOj216
palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు సినిమాలో ...
అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...
దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...
Comments
Post a Comment