Skip to main content

‘సూర్యాస్త‌మ‌యం`

SURYASTHAMAYAM movie release in Februaryప‌క్కా ప్ర‌ణాళిక‌, మొక్క‌వోని దీక్ష ఉండాలేగానీ కొండ‌ల్ని సైతం పిండి చేయొచ్చు అని అంటారు. అదే న‌మ్మ‌కంతో బండి స‌రోజ్‌కుమార్ ప్ర‌య‌త్నించి ఫ‌లితం చూశారు. సినిమా అంటేనే 24 శాఖ‌ల స‌మ్మిళితం. అందులో 11 శాఖ‌ల‌ను ఒంటి చేతి మీద నిర్వ‌హించి అరుదైన ఫీట్ చేశారు బండి స‌రోజ్ కుమార్‌. ఆయ‌నే క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, పాట‌లు రాసి సంగీతాన్ని స‌మ‌కూర్చి, స్టంట్లు డిజైన్ చేసి, సినిమాటోగ్రాఫీని హ్యాండిల్ చేసి, ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకుని, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేసుకుని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `సూర్యాస్త‌మ‌యం` తొలి కాపీ సిద్ధ‌మైంది. ఓజో మీడియా ప‌తాకంపై ర‌ఘు పిల్లుట్ల‌, ర‌వికుమార్ సుద‌ర్శి నిర్మించిన చిత్రం `సూర్యాస్త‌మ‌యం`. ఫిబ్ర‌వ‌రి ద్వితీయార్ధంలో విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా బండి స‌రోజ్‌కుమార్ మాట్లాడుతూ “ఇటీవ‌ల విడుద‌ల చేసిన `ఉరిమే మేఘం స్నేహం, కురిసే వ‌ర్షం స్నేహం..` అనే పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. స్నేహం గురించి ప‌దికాలాల పాటు నిలిచిపోయే అద్భుత‌మైన పాట చేశావ‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. నేను రాసిన పాట‌కు, స‌మ‌కూర్చిన బాణీకి గాయ‌కుడు శ్రీక‌ర్ జొన్న‌ల‌గ‌డ్డ న్యాయం చేశారు. ఆయ‌న గాత్రంలో పాట విన‌సొంపుగా ఉంది. సినిమాలోని ప్ర‌తి పాటా అదే స్థాయిలో ఉంటుంది. `సూర్యాస్త‌మ‌యం` ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. స‌హ‌జ‌సిద్ధ‌మైన లొకేష‌న్ల‌లో ఆర్టిస్టుల‌కు ఎలాంటి మేక‌ప్ ఉప‌యోగించ‌కుండా, చాలా నేచుర‌ల్‌గా  తెర‌కెక్కించాం. ఇది నేచుర‌ల్ యాక్ష‌న్ మూవీ. ఒక పోలీస్‌కీ, గ్యాంగ్‌స్ట‌ర్‌కీ మ‌ధ్య జ‌రిగే అంత‌ర్యుద్ధం ఈ సినిమాలో ప్ర‌ధాన క‌థాంశం. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో నేను, గ్యాంగ్‌స్ట‌ర్‌గా త్రిశూల్ రుద్ర యాక్ట్ చేశాం. త‌మిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కీల‌క‌మైన పాత్ర పోషించారు. హైద‌రాబాద్‌, వికారాబాద్‌, న‌ల్గొండ‌, రామోజీ ఫిల్మ్ సిటీ, క‌డ‌ప‌, క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. తొలి కాపీ సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ని, ఫిబ్ర‌వ‌రి ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.

త్రిశూల్ రుద్ర‌, హిమాన్సీ కాట్ర‌గ‌డ్డ‌, బండి సరోజ్ కుమార్, కావ్యా సురేష్‌, డేనియ‌ల్ బాలాజీ, మాస్ట‌ర్ అక్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్ సాయికిర‌ణ్‌, బేబీ శ‌ర్వాణీ, మోహ‌న్ సేనాప‌తి, వివేక్ ఠాకూర్‌, సాయిచంద్‌, కేకే బినోజీ, ప్రేమ్‌కుమార్ పాట్రా, షానీ, వంశీ ప‌స‌ల‌పూడి, శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు ఈ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.

ఈ చిత్రానికి డీటీయ‌స్ మిక్సింగ్‌:  వాసుదేవ‌న్‌, డీ ఐ క‌ల‌రిస్ట్:  ఎం. మురుగ‌న్‌.

 

 

English Title: SURYASTHAMAYAM movie release in February

Copy case on Dil raju's Mr. perfectSobhita dhulipala thighs show goes viralReginaThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailerControcersy Short Film made by Nagababu on Balakrishna



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G001kk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...