Skip to main content

‘4 లెట‌ర్స్‌` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు

 '4 LETTERS' MOVIE TEASER LAUNCHED BY LEGENDARY Director SRI. K. RAGHAVENDRA RAO GARU. నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెట‌ర్స్‌` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు.ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`.’కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక.ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

`4 లెట‌ర్స్‌` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు.

ఈ  చిత్రం టీజర్ ను దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ ప్రవాస భారతీయుడైన ఈ చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్ గారు నిర్మించిన ఈ చిత్రం ‘4 లెటర్స్’ టీజర్ నేటి తరం యువతి యువకుల మనోభావాలకు అడ్డం పట్టేలా ఉంది. హీరో ఈశ్వర్ కు ఇది తొలి చిత్రమైనా ఎంతో చక్కగా నటించాడు. సత్యానంద్ గారి శిష్యరికం కాబట్టి చక్కని ప్రతిభ కనబరిచాడు. అతనికి చిత్రపరిశ్రమలో ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ లు ఈ చిత్రం తో మంచి విజయాన్ని అందుకోవాలని అభిలషించారు.

ఈ నెల ౩౦న చిత్రం ఆడియో, ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల
ఈ సంద‌ర్భంగా…నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం.  ఈ నెల ౩౦న చిత్రం ఆడియో,. ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల అవుతాయని తెలిపారు.

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..’ ఎంతోమంది టాప్ స్టార్స్ ను వెండితెరకు పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్  శ్రీ రాఘవేంద్ర రావు గారు నా తొలి చిత్రం టీజర్ ను విడుదల చేయటం, నన్ను ఆశీర్వదించటం సంతోషం గా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మంది అంటూ ఉంటారు. ఆయన చేతుల మీదుగా విడుదల అయిన ఈ చిత్రం టీజర్ తోపాటు, చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత  తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. టీజర్ ను గురు తుల్యులు శ్రీ రాఘవేంద్ర రావు గారి చేతులమీదుగా విడుదల అవటం ఈ చిత్ర విజయానికి శుభ సూచకం. ఆయనకు హృదయపూర్వక కృతఙ్ఞతలు. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం“ అన్నారు.

ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.

సాంకేతిక నిపుణులు:

కో డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,

క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్

 

English Title: ‘4 LETTERS’ MOVIE TEASER LAUNCHED BY LEGENDARY Director SRI. K. RAGHAVENDRA RAO GARU.

 

 

 

Copy case on Dil raju's Mr. perfectSobhita dhulipala thighs show goes viralSri reddy in lakshmis veeragrandham as lakshmiparvathiThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailerPriya Prkash varrier rejected allu arjun



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G1FlIs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...