రెమో లాంటి లవ్ ఎంటర్‌టైనర్ లో అద్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకులందరి ప్రశంశలు పొందిన శివకార్తికేయన్ హీరోగా, సమంత, కీర్తిసురేష్ లు హీరోయిన్స్ గా తమిళం లో ప్రముఖ నిర్మాత ఆర్.డి.రాజా 24ఏమ్ స్టూడియెస్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం సీమరాజ.. ఈ చిత్రం తమిళం లో విడుదలయ్యి కమర్షియల్ గా చాలా మంచి సక్సస్ ని సాధించింది. ఈ చిత్రానికి పొన్రమ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని గతంలో చాలా చిత్రాలు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం చేసిన ప్రముఖ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల సాయికృష్ణా ఫిలింస్ ద్వారా తెలుగులో అనువాదం చేశారు. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్న ఈ సీమరాజ ని ఫిబ్రవరి 8న తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ సందర్బంగా నిర్మాత సాయికృష్ణా పెండ్యాల మాట్లాడుతూ.. రెమో చిత్రం ధియెటర్స్ ఎవెరేజ్ గా ఆడింది కాని టివి లో మాత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఎప్పుడూ ఆ చిత్రం వచ్చినా కూడా ఫ్యామిలి అంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ చిత్రం తో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.. రెమో తరువాత తెలుగులో శివకార్తికేయన్ నటించిన సీమరాజ ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయికృష్ణా ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నాము. రెండు వూర్ల మద్య జరిగే పక్కా కమిర్షియల్ చిత్రం ఈ సీమరాజ.. తమళం లో బి, సి సెంటర్స్ లో కలెక్షన్లు దుమ్మురేపింది. సీమరాజ గా శివకార్తికేయన్ నటన కి మాస్ ఆడియన్స్ విజిల్స్ పడటం ఖాయం. తమిళంలో లాగా తెలుగులో కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తుంది. అతి త్వరలో మ్యూజిక్ ని విడుదల చేస్తాము. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం లో ఆర్,డి,రాజా నిర్మించారు. సమంత చాలా మించి పాత్రలో నటించిది. ఫిబ్రవరి 8 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. అని అన్నారు.
దర్శకత్వం… పోన్రమ్
నిర్మాత.. సాయికృష్ణ పెండ్యాల
సమర్ఫణ.. లక్ష్మి పెండ్యాల
సంగీతం.. డి.ఇమ్మాన్
డిజైనర్.. ఈశ్వర్
English Title: Seema Raja to release on February 8
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SbuHW9

Comments
Post a Comment