సూపర్‌స్టార్ దంపతులకు ‘తెలుగు సినిమా గ్రంథం’ అంకితం
తెలుగు సినిమా లెజెండ్స్ అక్కినేని, దాసరి, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచయితగా వెలువరించిన ‘86 సంవత్సరాల తెలుగు సినిమా‘ గ్రంథాన్ని సూపర్‌స్టార్ కృష్ణ, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డర్, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల అంకితం తీసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ నివాసంలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ అంకితోత్సవంలో రచయిత, 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సాంస్కృతిక పరంగా దేశవిదేశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కె.ధర్మారావు తన స్వాగతవచనంతో తెలుగు సినిమాకు ఒక గాఢాభిమానిగా దశాబ్దాలుగా తన వద్దనున్న, వివిధ రకాలుగా సేకరించిన సమాచారంతో 86 వసంతాల తెలుగు సినిమాను ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగిందని, ఈ విషయాలను దర్శకరత్న డా. దాసరి 4 సంవత్సరాలుగా వింటూ తమ ప్రశంసలు అందించడం తాను పడిన శ్రమను మర్చిపోయేటట్లు చేసిందన్నారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ 484 పేజీలు విషయం, మరో 24 పేజీలు రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను బాగా ఆవిష్కరించారు. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది. రచయిత ఈ పుస్తకంపై వెచ్చించిన 14 సంవత్సరాలకు తాను ప్రత్యక్ష సాక్షి అన్నారు. ఒక వివాహ వేడుకగా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం తమను ఎంతగానో ఆకట్టుకుందని, ఇంత అందమైన విషయంతో కూడిన పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా తాము భావించామని, తమకు ఇంత మంచి గ్రంథాన్ని అంకితం చేసినందుకు రచయితను అభినందించారు గ్రంధ స్వీకర్తలు స్టార్ కపుల్ కృష్ణ, విజయనిర్మల.
సభాధ్యక్షత వహించిన సినీ నటుడు నరేష్ వికె మాట్లాడుతూ – ”ధర్మారావు తెలుగు సినిమా 86 సంవత్సరముల చరిత్రను చక్కగా విశధీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు” అన్నారు.
సభలో సినీ నటి రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా. కీమల ప్రసాదరావు, ఫా. గౌరవ ఛైర్మన్ ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య శ్రీమతి ఆదుర్తి సూర్య కుమారి పాల్గొన్నారు. సమావేశానికి ముందు గాయని టి.లలితరావు, డా. టీవి రావులు కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి సభను అలరించారు.
English Title: ‘Telugu Cinema Grantham’ Dedicated To Superstar Couple
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TeX0jM
palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు సినిమాలో ...
అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...
దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...
Comments
Post a Comment