Skip to main content

ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్

Prema Katha Chitram release on 22nd Febప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ ద్వారా కోటి 43 ల‌క్ష‌లు దక్కించుకోవడం విశేషం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న మరో ప్ల‌స్ అవుతుంది.  ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. హిందీ శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ ని కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు రావు రమేష్ గారు ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. ఆయన వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులు కథలోకి లీనమవుతారు. ఆయనకు ఈ సందర్భంగా మా యూనిట్ తరపున స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్ గా నటిస్తున్నారు.  విధ్యుల్లేఖ‌, ప్ర‌భాస్ శ్రీను మ‌ధ్య వ‌చ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం.  పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది. అని అన్నారు
న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,
ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి
సంగీతం – జె.బి
డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
పీఆర్వో – ఏలూరు శ్రీను
ఆర్ట్ – కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత –  ఆర్. సుదర్శన్ రెడ్డి

దర్శకుడు – హరి కిషన్

English Title: Prema Katha Chitram 2 movie to release on 22nd Feb

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FQj3cR

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...