
హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేలా వున్నాయి. యూత్‌ని ఆకట్టుకునే అంశాలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించే సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని ‘కోపంగా.. కోపంగా.. అనే పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు అఖిల్ వేసిన స్టెప్స్ సింప్లీ సూపర్బ్. ఈ పాట యూత్‌ను బాగా మెప్పిస్తుంది. ఆల్రెడీ చిత్రంలోని అన్ని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సూపర్‌హిట్ అవ్వడంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయని చెప్పొచ్చు.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
English Title: 5M views for Mr. majnu movie trailer
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CJMtGr

Comments
Post a Comment