‘యమ్6’ సెన్సార్ పూర్తి – ఫిబ్రవరి మొదటి వారం విడుదల
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన చిత్రం ‘యమ్6‘. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ ”మా ‘యమ్6’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా చాలా క్వాలిటీగా నిర్మించాం. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఒక అద్భుతమైన కథని దర్శకుడు జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు జైరామ్‌వర్మ మాట్లాడుతూ ”నిర్మాత విశ్వనాథ్‌గారు ఈ సినిమాను క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సినిమాను నేచురల్‌గా తెరకెక్కించాం. ప్రత్యేకంగా పోరాట ద శ్యాలు మన కళ్ళముందే జరుగుతున్నట్లు ఉంటూ అందరినీ అలరిస్తాయి. ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. ఇప్పుడు తెలుగు ప్రజలు కూడా ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్ చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఒక రకమైన ప్రయోగంలా భావించి తెరకెక్కించాము. చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్‌గా ఫీల్ అవుతూనే లవ్, కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
హీరో ధ్రువ మాట్లాడుతూ ”ఒక మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా టాలెంట్‌ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు క త్ఞతలు” అన్నారు
ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, సినిమాటోగ్రఫీ: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్, సమర్పణ: శ్రీమతి పార్వతి, నిర్మాత: విశ్వనాథ్ తన్నీరు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైరామ్ వర్మ
English Title: M6 movie has completed censor formalities
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2snS5RA
palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు సినిమాలో ...
అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...
గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...
Comments
Post a Comment