
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాద యాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర తన రాజకీయ యాత్ర లో ఎంత కీలకమే కొంతమందికే తెలుసు. అప్పటి రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొవటానికి ఈ యాత్ర మెదలుపెట్టారు.. కాని ఆ యాత్రలో ఎన్ని విషయాలు ఆయన ఎంత దగ్గరగా చూశారో, సాదారణమైన కష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా కలిసారో, పేదవారంటే ఎవరొ.. వారు దేనికొసం చూస్తున్నారొ ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఇలా ఓక ముఖ్యమంత్రి అభ్యర్ది మహనాయకుడు నేరుగా వచ్చి వారి సమస్యల్ని తెలుసుకోవటాన్ని పేద బడుగుబలహీన వర్గాల ప్రజలు తమ ఆనందాన్ని పాట రూపంలో మలిచారు..
కోటలో కోలువయ్యే రేడు పేట దారే పట్టినాడు …పాత రాతలన్నీ మారిపోయే ఆసలెన్నో తెచ్చినాడు
పల్లవి: 2
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో(2)
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో(2)
మండిపోయే బడుగోళ్ళ తలపై గొడుగు నీడై వొచ్చాడయ్యో
మంది కోసమే తానున్న నంటూ మాటిచ్చే మారాజయ్యో.
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
Bridge:
మెతుకును ఎరగని బతుకుల మొరవిని నీటి మబ్బులా కరిగాడు
బీటను విచ్చిన బీళ్ళను తడిపిన వాన జల్లులా కురిసాడు
చరణం:
ఉసూరుమంటూ నిట్టూర్పు సెప్పే ఊసులన్నీ విన్నాడురా
లేనోళ్ళ గడపకి ఐనోడిలాగా ఆసరా తానన్నాడురా
రైతన్న సేనుకి సంక్రాంతి గా
కష్టాల పడవకి సుక్కానిగా
నీ అడుగు పడితే మావైపిలా
రాజన్న నిన్నాపగలరా.. ”
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
మండిపోయే బడుగోళ్ళ తలపై గొడుగు నీడై వొచ్చాడయ్యో
మంది కోసమే తానున్న నంటూ మాటిచ్చే మారాజయ్యో.
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ… మడమతిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాత్రలో మమ్ముట్టి గారు నటిస్తున్నారు. మమ్ముటి గారు ప్రజానాయకుడు వై ఎస్ ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారని నిస్సందేహంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మెదటి లుక్ కి, టీజర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
ఈ సందర్బంగా యాత్ర రెండవ సింగిల్ ని లెజెండరి రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్ట్రి గారు రచించారు. కె సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం యెక్క ప్రమెషనల్ ఈవెంట్స్ ఒక్కొక్కటి మెమె తెలియజేస్తాము.. ప్రతి తెలుగు వాడికి ఈ సినిమా రీచ్ అయ్యేలా ప్రమెషన్ ని ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఏకకాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8 న విడుదల చేస్తున్నాము.. అని అన్నారు
నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి…..తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్
మ్యూజిక్ – కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ – సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ – Knack Studios
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను
సమర్పణ – శివ మేక
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CJaZZc
Subscribe to my channel
Comments
Post a Comment