రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బిసి కేంద్రాల్లో మాత్రం మంచి వసూళ్ల నే రాబడుతోంది . 8 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో 51 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది వినయ విధేయ రామ చిత్రం . బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు . ఇక చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది . జనవరి 11 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది అయితే సంక్రాంతి సెలవులు రావడంతో పాటుగా మెగా ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా లభించడంతో భారీ ఓపెనింగ్స్ సాధ్యమయ్యాయి .ఎనిమిది రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 12 . 14 కోట్ల షేర్
సీడెడ్ – 11. 32 కోట్ల షేర్
కృష్ణా – 3. 49 కోట్ల షేర్
వైజాగ్ – 7. 28 కోట్ల షేర్
గుంటూరు – 6. 13 కోట్ల షేర్
నెల్లూరు – 2. 67 కోట్ల షేర్
ఈస్ట్ – 4. 92 కోట్ల షేర్
వెస్ట్ – 4 కోట్ల షేర్
మొత్తం – 51. 95 కోట్ల షేర్
English Title: Vinaya Vidheya Rama 8 Days Collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RV5H5d

Comments
Post a Comment