
జనవరి 11న రాంచరణ్ నటించిన ” వినయ విధేయ రామ ” చిత్రం విడుదల అవుతోంది , ఇక ఆ మరుసటి రోజున జనవరి 12న వెంకటేష్ – వరుణ్ తేజ్ నటించిన ” ఎఫ్ 2 ” చిత్రం విడుదల అవుతోంది . అంటే జనవరి 9 నుండి ప్రతీ రోజు కు ఒక సినిమా చొప్పున నాలుగు రోజుల్లో నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి దాంతో నలుగురు హీరోల మధ్య భీకరమైన పోరు సాగనుంది . ఈ నలుగురు కూడా స్టార్ హీరోలు కావడంతో మొదటగా థియేటర్ ల సమస్య రానుంది . ఆ తర్వాత అభిమానుల పోరు కూడా స్టార్ట్ కానుంది . మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ హీరోల కంటే అభిమానుల ఫైటింగ్ ఎక్కువ కానుంది . ఈ నాలుగు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అయితే ఏ సినిమా అయితే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది మిగతా సినిమాలకు ఇబ్బంది తప్పకపోవచ్చు . మొత్తానికి సంక్రాంతి కి కోడి పందాల లాగా కానుంది ఈ హీరోల సినిమాల పరిస్థితి .
English Title: Big fight in pongal race
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ArOJSe
Subscribe to my channel
Comments
Post a Comment