రేయ్ …… అఖిల్ ఎన్టీఆర్ ని చూసి మాస్ అంటే ఏంటో నేర్చుకో అంటూ అక్కినేని అభిమానుల ముందు అన్నాడు కింగ్ నాగార్జున . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా వచ్చాడు . ఎన్టీఆర్ అంటే మాస్ అన్న విషయం తెలిసిందే . మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ ని చూసి మాస్ హీరోగా ఎలా ఆకట్టుకోవాలో చూసి నేర్చుకో అంటూ సలహా ఇచ్చాడు అఖిల్ కు .అక్కినేని హీరోలు మొదటి నుండి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా నందమూరి హీరోలు మాత్రం మాస్ ని అలరించే చిత్రాలతో ఆకట్టుకున్నారు దాంతో అక్కినేని అంటే క్లాస్ , నందమూరి అంటే మాస్ అని ఫిక్స్ అయిపొయింది . అయితే అక్కినేని హీరోలు మాస్ చిత్రాలు చేస్తున్నప్పటికీ వాళ్లకు మాస్ ఇమేజ్ మాత్రం రావడం లేదు అలాగే నందమూరి హీరోలు ప్రేమ కథా చిత్రాలు చేయాలనీ చూస్తున్నా క్లాస్ ఇమేజ్ రావడం లేదు మరి .
English Title: Nagarjuna shocking comments on akhil and ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Hjl6Zb

Comments
Post a Comment