Skip to main content

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

keerthy suresh new movie openingఅల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం గురువారం హైదారాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ప్రారంభ‌మైంది. న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా.. డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ సినిమాను కెమెరా స్విచ్చాన్ చేశార‌. దేవుడి ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్క్రిప్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు, పరుచూరి గోపాల‌కృష్ణ‌, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, స్ర‌వంతి రవికిషోర్ డైరెక్ట‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

కీర్తి సురేష్ మాట్లాడుతూ – “తెలుగులో `మ‌హాన‌టి` త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా. మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రంలో న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. ప్ర‌తి అమ్మాయికి క‌నెక్ట్ అయ్యే సినిమా. ఎక్కువ భాగం సినిమా యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. డైరెక్ట‌ర్ న‌రేంద్ర మంచి క‌థ‌ను సిద్ధం చేశారు. త‌ప్ప‌కుండా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాన‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు నరేంద్ర మాట్లాడుతూ – “2016 నుండి ఈ క‌థ‌పై వ‌ర్క్ చేస్తున్నాను. త‌రుణ్ నాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేశాడు. అన్నీ ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపిన క‌థ ఇది. ఈ క‌థ‌కు కీర్తిసురేష్‌గారు త‌ప్ప మ‌రేవ‌రూ సూట్ కారు. 25 శాతం ఇండియాలో… 75 శాతం యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది. ఏప్రిల్ లో యు.ఎస్‌.షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. . కుటుంబ క‌థా ప్రేక్ష‌కులు స‌హా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది“ అన్నారు.

నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “`మ‌హాన‌టి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృద‌యాల్లో ఎంత‌టి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాంటి చిత్రం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో ఆమె సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రం. ప్ర‌తి అమ్మాయి త‌న జీవితంలో త‌మ జీవితంలో ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి సిచ్యువేష‌న్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మ‌హిళ‌ల‌కు క‌నెక్ట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కోడూరి మాట్లాఉతూ – “మ‌హేష్ కోనేరు నిర్మాత‌గా చేస్తోన్న మూడో సినిమా ఇది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సంగీతం అందిస్తాను. కీర్తిసురేష్‌తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది“ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CaGREO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...