Skip to main content

`ఊరంతా అనుకుంటున్నారు` ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లాంచ్‌

Oorantha Anukuntunnaaru first look teaser launchరోవాస్కైర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రీనివాస్ అవ‌స‌రాల హీరోలు. మేఘా చౌద‌రి, సోఫియా సింగ్ నాయిక‌లు. బాలాజి సాన‌ల ద‌ర్శ‌కుడు. శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఫ‌స్ట్ లుక్‌ను విజ‌య‌నిర్మ‌ల‌, హీరో ఫ‌స్ట్ లుక్‌ను న‌రేష్‌, న‌వీన్ లుక్ టీజ‌ర్‌ను కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల విడుద‌ల చేశారు. హీరో న‌వీన్ విజ‌య్‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ కేక్ క‌ట్ చేసిన సెల‌బ్రేట్ చేశారు.

కృష్ణ మాట్లాడుతూ “టైటిల్ బావుంటే సగం సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. అందులోనూ ఈ సినిమాకు `ఊరంతా అనుకుంటున్నారు` అనే నేటివ్ టైటిల్ దొరికింది. ఇంగ్లిష్ ప‌దాల‌తో ఎక్కువ టైటిల్స్ వ‌స్తున్న ఈ సమ‌యంలో ఇలాంటి టైటిల్ రావ‌డం బావుంది. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా అట్మాస్పియ‌ర్‌లో పెరిగాడు మా న‌వీన్‌. త‌న‌లో ఈజ్ ఉంది. పాట‌లు, ఫైట్లు అన్నీ బాగా చేయ‌గలుగుతున్నాడు. ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా న‌రేష్ జ‌డ్జిమెంట్ బావుంటుంది. న‌రేష్ క‌థ విన్నాన‌ని.. బావుంద‌ని చెబుతున్నాడంటే సినిమాలో విష‌యం ఉన్న‌ట్టే. న‌వీన్‌కి ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి“ అని అన్నారు.

విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ “నిర్మాత‌ను , ఈ సినిమాను అంద‌రూ దీవించాలి“ అని అన్నారు.
కె.ఎం.రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ “న‌వీన్ పాత్ర చాలా బావుంటుంది. క‌థాబ‌లం ఉన్న సినిమా. గ్రామీణ నేప‌థ్యంతో సాగుతుంది“ అని చెప్పారు.

న‌వీన్ మాట్లాడుతూ “పాల‌కొల్లులో ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ పాల‌కొల్లుకు వెళ్ల‌లేదు. ఈ సినిమాతో అక్క‌డే సెటిల్ కావాల‌నిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది“ అని అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ “నందిని న‌ర్సింగ్ హోమ్‌తో న‌వీన్ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, ఆర్టిస్ట్ గా నిల‌దొక్కుకోవాల‌నేది అత‌ని తాప‌త్ర‌యం. ఆ సినిమా త‌ర్వాత 5,6 స్క్రిప్ట్ లు విన్నాడు. వాటిలో ఈ క‌థ మాకు బాగా న‌చ్చింది. నేను బావున్నాయ‌న్న సినిమాలు 99 శాతం ఫెయిల్ కాలేదు. ఇది మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది. టైటిల్ బావుంది. మిగిలిన తారాగ‌ణం కూడా చాలా బావుంది. నేను ప్రివ్యూ చూశాను. నిర్మాత‌లకు టేస్ట్ ఉంద‌నిపించింది. డ‌బ్బింగ్ జ‌రుగుతోంది“ అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ “గ్రామీణనేప‌థ్యంలో అందంగా సాగే సినిమా ఇది. క్యూట్ విలేజ్ బోయ్‌గా న‌వీన్ మెప్పిస్తాడు. కొత్త జోన‌ర్ సినిమా అవుతుంది. న‌వీన్‌లోని ప‌లు షేడ్స్ ఈ సినిమాలో ఆవిష్కృత‌మ‌వుతాయి“ అని అన్నారు.

జ‌య‌సుధ‌, కోట శ్రీనివాస‌రావు, రావు ర‌మేష్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా ర‌వీంద్ర‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తి, జ‌బ‌ర్ద‌స్త్ రాము, జ‌బ‌ర్ద‌స్త్ బాబి, గౌత‌మ్‌రాజు, అప్పాజి, క్రాంతి కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ‌న్‌, పాట‌లు: వ‌న‌మాలి, పెద్దాడ‌మూర్తి, శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, కెమెరా: జి.ఎల్‌.ఎన్‌.బాబు, ఎడిటింగ్: మ‌ధు, నృత్యాలు: భాను, క‌థ‌: శ్రీమంగ‌ళం, ర‌మ్య‌, ఆర్ట్: కృష్ణ‌మాయ‌, నిర్మాణ స‌హ‌కారం: యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నిర్మాత‌లు: శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బాలాజి సాన‌ల‌.

ReginaPawan kalyan sensational comments on NTRNo invitation for Jr NTR from balakrishnaVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FBFaDv

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...