Skip to main content

`య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రం చూస్తుంటే ఒక లైఫ్ చూస్తున్న‌ట్లు అనిపించింది – సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

Super Star Krishna Appreciates NTR Kathanayakudu movieవిశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ రూపంలో తెరకెక్కించారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానం ఆధారంగా చేసుకుని తొలి భాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` రూపొందింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తండ్రికి త‌గ్గ త‌నయుడిగా, ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా బాల‌కృష్ణ న‌ట‌న అద్వితీయం అంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలే కాదు.. విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగా సుమంత్‌, నంద‌మూరి హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ల్యాణ్‌రామ్‌లు అద్భుతంగా ఒదిగిపోయార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

న‌టసింహ నంద‌మూరి బాల‌కృష్ణతో `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` వంటి సెన్సేష‌న‌ల్ మూవీని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు జాగర్ల‌మూడి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ బ‌యోపిక్‌ను సాయికొర్ర‌పాటి, విష్ణు ఇందూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌.బి.కె.ఫిలింస్‌, వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి ప‌తాకాల‌పై నంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నంద‌మూరి బాల‌కృష్ణ ఈ బ‌యోపిక్‌ను నిర్మించి.. తెలుగు జాతి గొప్ప‌తనాన్ని, ఔన‌త్యాన్ని భావిత‌రాల‌కు అందించే గొప్ప ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి ఉనికి ప్ర‌పంచానికి చాటిన ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంతో రూపొందిన `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ‌, శ్రీమతి విజ‌య నిర్మ‌ల ప్ర‌త్యేకంగా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా

సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ -“నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది. బాల‌కృష్ణ‌గారు.. ఎన్టీఆర్‌గారిలా వంద‌శాతం క‌నిపించారు. ఆయ‌న వేసిన అన్నీ గెట‌ప్స్‌లోనూ బావున్నారు. డెఫ‌నెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని  ఆశిస్తున్నాను“ అన్నారు.

శ్రీమ‌తి విజ‌య నిర్మల మాట్లాడుతూ – “నాకు ప‌న్నెండేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్‌గారితో క‌లిసి పాండు రంగ మ‌హ‌త్యం చేశాను. ఆ సినిమాలో కృష్ణుడిగా న‌టించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్న‌ట్లుండేలా బాల‌కృష్ణ‌గారు న‌టించారు. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం“ అన్నారు.

న‌రేష్ విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ – “య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ అనౌన్స్ అయిన‌ప్పుడు ఇందులో ఓ అవకాశం వ‌స్తుందా! అని ఆస‌క్తిగా ఎదురుచూశాను. మా అమ్మ‌గారి తొలి సినిమా ఆయ‌న‌తోనే న‌టించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా స‌మ‌యంలో ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ బ‌యోపిక్‌లో వేషం వేయాల‌ని న‌న్ను అడిగిన‌ప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బ‌రావుగారి వేషం. ఆ స‌న్నివేశాల‌ను నేను చేస్తున్న‌ప్పుడు థ్రిల్ ఫీల‌య్యాను. ద‌ర్శ‌కుడు క్రిష్‌గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్ట‌ర్ నుండి లెజెండ్రీ డైరెక్ట‌ర్ అయ్యారు. ఆయ‌న బ‌యోపిక్‌ను తీయ‌డం అంత సుల‌భం కాదు. కానీ క్రిష్ ఓ ప్లానింగ్‌తో అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. త‌న‌కు హ్యాట్సాఫ్‌. అలాగే బాల‌య్య‌గారిని అన్న‌ద‌మ్ముల అనుబంధం సినిమా స‌మయంలో క‌లిశాను. త‌న‌తో మంచి అనుబంధం ఉంది. మేం మంచి మిత్రులం. ఈ సినిమాత బాల‌కృష్ణ‌గారు మ‌హాన‌టుడిగా అవ‌త‌రించారు తన‌కు హ్యాట్సాఫ్‌“ అన్నారు.

English Title: Super Star Krishna Appreciates NTR Kathanayakudu movie



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QFjRD8

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...