
ఈ సందర్బంగా నిర్మాత చిత్ర విశేషాలను పంచుకుంటూ ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏం జరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్ లో పెద్ద దిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ అనే వినూత్న పవర్ ఫుల్ పాత్రలో నటీమణి అన్నపూర్ణ కనిపిస్తున్నారు. ఆ పల్లెటూరిలోనే ఆమె కు ధీటుగా ఎదురెళ్లే వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. ఇక షూటింగ్ సెట్ విషయానికి వస్తే.. ఆ ఊరిలోనే పంచాయతీ దర్బార్ సెట్ అందరినీ ఆకర్షింప చేస్తుంది. అంతేకాకుండా పంచాయతీ సన్నివేశాలకు గానూ రెండు వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అర్చన హీరోయిన్ గా నటిస్తుండగా జీవ, రఘు బాబు , కాటమంచి రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, శ్రీ హర్ష, అదుర్స్ సాయి, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రభ, జయ వాణి తదితరులు నటిస్తున్నారని నిర్మాత ఎం ఎన్ ఆర్ చౌదరి చెప్పుకొచ్చారు.
English Title: ‘Annapoornamma gari Manavadu’ movie
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FKVz8U

Comments
Post a Comment