Skip to main content

ఎన్‌.శంక‌ర్ చేతుల‌మీదుగా.. ఏవీఎస్ వార‌సుడి `వైదేహి` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

 Vaidhehi movie triler launchయాక్టివ్  స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎ.జి.ఆర్‌.కౌశిక్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం వైదేహి. ఎ.జ‌న‌ని ప్ర‌దీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు క‌మెడియ‌న్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కీ.శే.ఎవిఎస్‌  కుమారుడు ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వైదేహి. ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ జ‌న‌వ‌రి 2న ఆయ‌న‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా రామానాయుడు స్టూడియోలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌.శంక‌ర్ గారి చేతుల మీద‌గా ట్రైల‌ర్ లాంచ్ మ‌రియు సీనియ‌ర్ పాత్రికేయులు రామారావుగారితో కేక్‌ను క‌ట్ చేయించారు.

విలేక‌రుల స‌మావేశంలో రామారావుగారు  మాట్లాడుతూ … ఆయ‌న‌తో నాకు చాలా అనుబంధం ఉంది. జ‌ర్న‌లిస్ట్ గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఆయ‌న బాపుర‌మ‌ణ‌లంటే చాలా ఇష్టం. హైద‌రాబాద్‌లో ఒక ఇల్లుని నిర్మించి ఆ ఇంటికి బాపుర‌మ‌ణ‌ల పేరును పెట్టారు. ఆయ‌న కుమారుడు ద‌ర్శ‌కుడుగా రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌నకి మంచి పేరు రావాల‌ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ… ఎవిఎస్‌గారు నాకు మంచి మిత్రులు చాలా మందితో మంచి అనుబంధం ఉన్నా నాతో ఒక ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అంద‌రితో చ‌క్క‌గా క‌లిసిపోతారు. ఆయ‌న‌కు ఉన్న సినిమా, సాహిత్యం అన్నీ ఓ ప‌ట్టుప‌ట్టారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవిఎస్‌గారు లేని లోటు తెలుస్తుంది. ఆయ‌న మంచిత‌నం, ఆయ‌న స్నేహం మ‌ర‌పురానికి ఎప్పుడూ గుర్తుకువ‌స్తూనే ఉంటాయి. 90శాతం ఇలాంటి హార‌ర్ చిత్రాలు స‌క్సెస్ కాకుండా లేవు. ప్ర‌దీప్ తొలి అడుగే ఇలాంటి జోన‌ర్‌తో వ‌స్తున్నాడంటే క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తారు. ట్రైల‌ర్ చూశా చాలా బావుంది. అందులోని క్యూరియాసిటీగాని యాక్ట‌ర్స్ పెర్ఫార్మెన్స్‌గాని చాలా బాగా వ‌చ్చాయి. ఈ చిత్రంలో న‌టించిన టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

హీరో మ‌హేష్ మాట్లాడుతూ…స్క్రీన్‌మీద న‌న్ను నేను చూసుకోవ‌డం మొద‌టిసారి. చాలా ఆనందంగా ఉంది. ప్ర‌దీప్ అన్న నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ప్ర‌ణ‌తి మాట్లాడుతూ… వైదేహి నాకు చాలా స్పెష‌ల్ చిత్రం నాకు పింకీ ఈ చిత్రంలో చాలా స్పెష‌ల్. వైదేహి అంద‌రూ త‌ప్ప‌క చూడండి చాలా హార‌ర్ చిత్రం. నాకు హార‌ర్ చిత్రాలంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ అనుకోలేదు. నాకు మొద‌టి సినిమానే హార‌ర్ చిత్రం వ‌స్తుంద‌ని అని అన్నారు.

అఖిల మాట్లాడుతూ…  నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌దీప్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో ప‌ని చేసిన టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మాట్లాడుతూ… నాన్న‌గారి పుట్టిన‌రోజు థియేట్రిక‌ల్  ట్రైల‌ర్ లాంచ్ అవుతుంద‌ని ముందుగా నేను అనుకోలేదు. స‌డెన్ అలా కుదిరింది.  నేను స్టోరీ సెలెక్ట్ చేసుకుని స‌ఫ‌ర్ అవుతున్న టైంలో. నా వెంటే వుండి న‌న్ను వెను త‌ట్టి న‌డిపింది నా స్నేహితుడు ముందుగా ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు.  ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రినీ నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. కాని ఎవ్వ‌రూ కూడా విసుగులేకుండా ఒక ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగా బాగా క‌లిసిపోయి అంద‌రూ ప‌ని చేశారు. ముఖ్యంగా డిఒపి  చాలా బాగా కుదిరింది. మీ అంద‌రి న‌వ్వే నా ఎన‌ర్జీ. ఎన్‌. శంక‌ర్‌గారు నాన్న‌గారికి చాలా ద‌గ్గ‌ర ఎంత ద‌గ్గ‌రంటే ఏదైనా క‌ష్టం వ‌చ్చిందంటే మా ఫ్యామిలీ క‌న్నా ముందే ఆయ‌న‌తో షేర్ చేసుకునేవారు నాన్న‌గారు. నాకు తండ్రి త‌ర్వా త తండ్రి లాంటి వారు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు మ‌హేష్‌, ప్ర‌ణతి, సందీప్‌, అఖిల‌, లావ‌ణ్య‌, ప్ర‌వీణ్‌, వెంక‌టేష్‌, ఎ.వి.హాసిని, ఎ. రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్‌, శ్రీ‌హ‌ర్ష‌, క్రిష్ణ‌, తేజ‌, ర‌మేష్‌, చంద్ర‌కాంత్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో డిఓపి.దేవేంద్ర‌సూరి, మ్యూజిక్‌షారూక్‌, ఎడిటింగ్ఃఫ్లిక్కో ఆర్ట్స్‌, కోడైరెక్ట‌ర్ః ప‌ర‌వాస్తు దేవేంద్ర‌సూరి, ప్ర‌డ్యూస‌ర్ ఎ.జ‌న‌ని ప్ర‌దీప్‌, పిఆర్ ఓః ప‌వ‌న్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, డైలాగ్స్  ఎ.రాఘవేంద్ర‌ప్ర‌దీప్‌.

 

English Title: Vaidhehi movie triler launch



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VpqyN5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...