సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఆల్రెడీ రజనీకాంత్ గత సినిమా పేట కి అద్భుతమైన పాటలు ఇచ్చిన యువ సంచలనం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన స్వరాలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు ఇక ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే 1992లో పాండ్యన్ అనే సినిమా తర్వాత రజనీకాంత్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అటు మాస్ సినిమాలు చేస్తూనే అందులో అంతర్లీనంగా సమాజానికి అవసరమైన ఇటువంటి అంశాలను జోడించే దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అల్లిరాజా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన చంద్రముఖి సినిమాతో హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన నయనతార నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కథకి సంబంధించినంత వరకూ ఇది ఒక రివేంజ్ స్టోరీ అని సినిమా లవర్స్ ప్రచారం చేస్తున్నారు.
మురుగదాస్ గతంలో తీసిన “రమణ” సినిమా మాదిరి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం వల్ల బాధపడి ఆ సమస్యను సమాజంలోనే సమూలంగా తొలగించాలంటే ప్రయత్నం చేసే ఒక సోషల్ ఎక్స్పరిమెంట్ రివేంజ్ స్టోరీ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమాకు సంబంధించినంత వరకు ఒక హీరో ఉంటాడు ఒక విలన్ ఉంటాడు విలన్ హీరోకి అన్యాయం చేస్తాడు దానికి బదులుగా విలన్ కి బుద్ధి చెప్తాడు హీరో. ఈ ఒక బేసిక్ స్టోరీ లైన్ అనుకుంటే ప్రస్తుతం కొంతమంది దర్శకులు సామాజిక బాధ్యత అనే అంశాన్ని కూడా జోడించి ఆ కథలో హీరో కి జరిగిన అన్యాయానికి మూలకారణం తోపాటు సమాజంలోని అనేక రుగ్మతలు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, హీరో కేవలం తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడం కాకుండా పెద్ద స్థాయిలో ఆ సమస్య పై పోరాడి విజయం సాధించడం; అనేది అనేక హిట్ సినిమాల సక్సెస్ ఫార్ములా.
తమిళంలో శంకర్ దగ్గర్నుంచి మొదలెడితే మురుగదాస్ మరియు మన తెలుగు దర్శకులు కొరటాల శివ, వివి వినాయక్ వంటి అగ్ర దర్శకులు ఇదే పంథాలో సినిమాలు తీశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఉన్న స్థాయికి ఆయన ఒక మంచి కథ తీసుకొని తనదైన స్టైల్ మేనరిజం జోడించి సినిమా చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఏది ఏమైనా రజనీకాంత్ కొత్త సినిమా పేట మాదిరిగా ఈ దర్బార్ సినిమా కూడా అభిమానులను అలరించాలని కోరుకుందాం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qUFsk4
Comments
Post a Comment