కోలీవుడ్ అగ్రహీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన 64 సినిమాను కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ ఏడాది “ఖైతీ” సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా విద్యా వ్యవస్థ లో ఉన్న లోపాల ఆధారంగా ఉంటుందని ప్రాధమిక సమాచారం . ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యుల్స్ పూర్తి అయ్యాయి. కర్ణాటక లోఉన్న శివమొగ్గ దగ్గర ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ లో ఇంకొక హైలెట్ “మక్కల్ సెల్వన్” విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడు. ఇక విజయ్ ఇందులో ఒక కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో, ప్రస్తుత విద్యా వ్యవస్థ లో ఉన్న లోపాలపై పోరాడే వ్యక్తి గా కనపడతాడని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఇలాంటి కథ ఆధారంగా తమిళంలో శివ కార్తికేయన్ చేసిన “హీరో” అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్; ఒక ముఖ్యపాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. అయితే కొంతమంది ఈ రెండు సినిమాలకు పోలికలు పెడుతున్నారు. మరి కొంతమంది, ఈ సినిమా దర్శకుడు శంకర్ మొదటి సినిమా “జెంటిల్ మెన్” నుండి కాపీ కొట్టారని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ చాలామంది మూవీ లవర్స్ లోకేష్ కనగరాజ్ మార్క్ రియల్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఈ సినిమా విజయ్ కెరియర్ లో ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుందని చెప్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35ZXK2u
Comments
Post a Comment