అభిమానుల కోసం మన నైజాం నవాబ్ నితిన్ న్యూ ఇయర్ గిఫ్ట్ మూడు రోజుల ముందే ఇచ్చేసారు. తన తాజా చిత్రం “భీష్మ” సినిమాలో ఒక పాట అది కూడా, ఎక్కువ శాతం యూత్ దృష్టి లో ట్రెండ్ అవుతున్న సింగిల్స్ కాన్సెప్ట్ మీద “సింగిల్స్ ఆంతెం” అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటను యువ సాహిత్య సవ్యసాచి శ్రీమణి రచించగా, పాడే పాటను గొంతుతో కాకుండా, ఆత్మతో పాడే అనురాగ్ కులకర్ణి ఆలపించారు. స్వర బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చారు.
ఇక పాట విషయానికి వస్తే, నువ్ పడవా.. పాప…! అంటూ హీరో సింగిల్ లైఫ్ బాధలు ఇందులో చూపించారు. ముఖ్యంగా ఒక చరణం మళ్ళీ అచ్చ తెలుగు లో ఉంచి, స్వర సాగర్ – శ్రీ మణి తమ విలక్షణ నైపుణ్యాన్ని కూడా శ్రోతలకు అందించారు. మొత్తానికి ఈ పాట హిట్టు.
ఇక ఈ సినిమాలో ఓవర్ యాక్షన్ బ్రాండ్ అంబాసిడర్ రష్మిక హీరోయిన్. హేబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చలో సినిమాతో హిట్టు కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ అవుతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SxZGvf
Comments
Post a Comment