విలక్షణమైన చిత్రాలతో కమర్షియల్ హిట్లు సాధిస్తూ, కోలీవుడ్ లో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ప్రయోగాలు చేసే హీరో చియాన్ విక్రం. ఈ ఏడాది ఆయన నటించిన “కాదరన్ కొండేన్” సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచింది. తెలుగులో పాటు తమిళంలో కూడా ఆ సినిమా విజయం సాధించలేదు. కానీ హిట్ – ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విక్రం తనకంటూ ఒక మార్క్ ని, ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు.
ఇప్పుడు విక్రం కొత్త సినిమా “కోబ్రా” మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఒక బంగారపు నిధి, దానిపైన కిరీటం దానికి చుట్టుకుంటూ బుసలు కొడుతూ ఉన్న రెండు తలల త్రాచుపాము ని ఇందులో చూపించారు . ఈ మొత్తం సీక్వెన్స్ కి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ .రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోఅంతా, ఆ ఆర్.ఆర్ గురించే డిస్కస్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు డైరెక్టర్ కాగా, మాజీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ, తెరంగేట్రం చేస్తున్నారు. ఇక వరుస పరాజయాలతో ఇబ్బ్బందిపడుతున్న విక్రం ఈ సినిమాతో ఫామ్ లోకి ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EUsSoc
Comments
Post a Comment