మరి కొన్ని గంటల్లో 2019కి వీడ్కోలు పలకబోతున్నాం. అంతా కొత్త ఏడాది కోసం కొత్త కొత్త ప్లాన్‌లతో ఎదురుచూస్తున్నారు. సగటు మనిషి కొత్త సంవత్సరం కోసం ప్లాన్‌లు చేసుకుంటున్న వేళ సెలబ్రిటీలు కూడా సెలబ్రేషన్స్‌కి రెడీ అయినోతున్నారు. ఇప్పటికే కొంత మంది స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. కొంత మందేమో ఫేవరేట్ స్పాట్స్ కి వెళ్లిపోయారు. మరి కొంత మంది వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
అల్లు అర్జున్…`అల వైకుంఠపురములో` షూటింగ్ పూర్తయిపోవడంతో ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బ్యాంకాక్ వెళ్లిపోయారు. జనవరి 12న తన సినిమా రిలీజ్ వుండటంతో ఈ గ్యాప్‌లో వెకేషన్‌ని ప్లాన్ చేసుకున్న బన్నీ బ్యాంకాక్‌లో జాలీగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ కోసం జనవరి మొదటి వారంలో ఇండియాకు తిరిగి రానున్నారు. ఇయర్ ఎండింగ్‌లో `వెంకీ మామ`తో సూపర్ హిట్‌ని అందుకున్న నాగచైతన్య తన ఫేవరేట్ స్పాట్ గోవాకు సమంతతో కలిసి చెక్కేశారు. అక్కడే న్యూఇయర్ వేడుకల్ని జరుపుకోబోతున్నారు.
క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న న్యూ ఇయర్ వేడుకల్ని స్పెయిన్‌లో జరపుకోనుంది. నితిన్‌తో కలిసి రష్మిక నటిస్తున్న తాజా చిత్రం `భీష్మ`. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ఇటలీలో మొదలైంది. జనవరి మొదటి వారం వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. కాబట్టి న్యూ ఇయర్ వేడుకల తరువాతే రష్మిక ఇండియా రానుంది. `సరిలేరు నీకెవ్వరు` చిత్ర ప్రమోషన్‌లో ఆమె పాల్గొంటారు. శ్రియ రష్యాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతోంది. నితిన్ తన `భీష్మ1 చిత్రం కోసం జనవరి మొదటి వారం వరకు ఇటలీలోనే వుంటారు. దీంతో న్యూ ఇయర్ వేడుకల్ని అక్కడే జరుపుకోబోతున్నారు. ఇలా చాలా మంది స్టార్స్ న్యూ ఇయర్‌ని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37gIa2S
Comments
Post a Comment