అన్నంపెట్టి ఆపదల్లో వున్నప్పుడు అక్కున చేర్చుకుని నీడనిచ్చిన వారినే మర్చిపోయి పోజులు కొడుతున్న రోజులివి. ఇలాంటి విషపూరితమైన వాతావరణంలోనూ పది మందికి అండగా నిలుస్తూ అందులోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న మహానుభావులు కొంత మందే మనకు అక్కడక్కడ తారసపడుతుంటారు. అలాంటి వాళ్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి రాఘవ లారెన్స్. థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాఘవ గత కొంత కాలంగా అనాథల్ని చేరదీస్తూ వారికి అండగా నిలుస్తూ చెన్నైలో ఓ ఆశ్రమాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా అలాంటి ఆశ్రమాన్ని హైదరాబాద్‌లోనూ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే లారెన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి 10 లక్షలు విరాళాన్ని కూడా అందజేశారు. అయితే అందుకు తగ్గ సమయం వచ్చేసిందని, దాన్ని బాధ్యతగా నిర్వహించే వ్యక్తి తనకు లభించాడని గురువారం రాఘవ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్ పదవ తరగతి వరకు చదువుకుని తన చదువుకు తగ్గ పని కోసం గత కొంత కాలంగా వెతుకుతున్నాడు. అయితే అతనికి రెండు చేతులు లేకపోవడంతో అతనికి ఎవరూ పని ఇవ్వబం లేదు. దీంతో విసిగిపోయిన శిఉద్యోగం కోసం సమయం వచ్చేసిందని శివకుమార్ సోషల్ మీడియా ద్వారా రాఘవ లారెన్స్‌ని పని ఇప్పించమని ప్రాధేయపడ్డాడు.
దీంతో మనసు చెలించిన లారెన్స్ హైదరాబాద్ రావడమే కాకుండా శివకుమార్ వివరాలు తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి అతనికి హైదరాబాద్‌లో ప్రారంభించబోయే ఆశ్రమం బాధ్యతల్ని అప్పగిస్తున్నానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో రాఘవ లారెన్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో `దైవం మనుష్య రూపేనా`… నువ్వన్నా నిజమైన దేవుడివి.., సాయం చేయడంలో నువ్వు దేవుడివి.. అంటూ నెటిజన్స్ లారెన్స్‌కు జేజేలు పలుకుతున్నారు.
https://t.co/IvpzWzNmpf pic.twitter.com/XLakPi0PlG
— Raghava Lawrence (@offl_Lawrence) December 26, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Mu3bzd
Comments
Post a Comment