దక్షిణాదిపై బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తాప్సీ, రాధికా ఆప్టే దక్షిణాది చిత్ర పరిశ్రమపై ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అవి మర్చిపోకముందే మరో బాలీవుడ్ హాటీ నేహా దూపియా దక్షిణాదిపై విరుచుకుపడటం సంచలనంగా మారింది. బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రాల్లో నటించిన నేహా దూపియా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. నేహా టాక్ షో పేరుతో ఓ షోని రన్ చేస్తున్న ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో దక్షిణాది చిత్ర సీమపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దక్షిణాదిలో హీరోతో పోలిస్తే హీరోయిన్‌ని తక్కువ చేసి చూస్తారని వెల్లడించింది. బాలకృష్ణ నటించిన `పరమవీరచక్ర`, రాజశేఖర్ నటించిన `విలన్`, తరుణ్ చేసిన `నిన్నే ఇష్టపడ్డాను` చిత్రాల్లో నేహా నటించింది. తను దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న సందర్భంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోందని, ఆ సమయంలో తనకు ఆకలిగా వున్నా హీరో కు మాత్రమే ముందు పెడతామన్నారని, ఇంతటి వికారాలను నేను ఎక్కడా చూడలేదని వెల్లడించి షాకిచ్చింది.
ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగిందని, ఆ సమయంలో వారి ప్రవర్తన చూసి నవ్వుకున్నానని, చెప్పుకొచ్చింది. ఇన్నేళ్ల తరువాత నేహా దూపియా చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నాయి. నటుడు అంగాద్ బేడీని వివాహం చేసుకున్న నేహా దూపియా ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qaub9a
Comments
Post a Comment