Skip to main content

2019 ల‌వ్‌స్టోరీలు.. బ్రేక‌ప్‌లు…

 2019 break up stories
2019 break up stories

డేటింగ్‌లు, బ్రేక‌ప్‌లు ద‌క్షిణాదిలో చాలా అరుదు. కానీ బాలీవుడ‌ట్ పున్య‌మా అని అది ద‌క్షిణాదికి కూడా పాకింది. ఈ ఏడాది పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన చాలా మంది బ్రేక‌ప్‌లు చెప్పుకుని వార్త‌ల్లో నిలిచారు. కొంత మందైతే ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ బంధానికి వీడ్కోలు కూడా చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప్రేమ‌లో వున్నామంటూ ప్ర‌క‌టించిన జంట‌లు కొన్ని రోజులు గడ‌వ కుండానే విడిపోతున్నాంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన షాకిచ్చారు.

ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌ గారాల ప‌ట్టి, పైగా స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ త‌న‌కు బాగా న‌చ్చాడ‌ని ఇటాలీయ‌న్ న‌టుడు మైఖేల్ క్రోస‌న్‌ని  ప్రేమించింది. ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగారు. ఈ విష‌యం క‌మ‌ల్‌హాస‌న్ దాకా వెళ్లింది. చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి సంప్ర‌దాయ బ‌ద్దంగా త‌మిళ పంచె క‌ట్టులో శృతిహాస‌న్‌తో క‌లిసి మైఖేల్ క్రోస‌ల్ పాల్గొన్నాడు. దంతో త్వ‌ర‌లో ఇద్దరు పెళ్లిపీట లెక్క‌బోతున్నారని కోలీవుడ్ అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ వార్త‌ల‌కి ఫుల్ స్టాప్ పెడుతూ ఏప్రిల్‌లో శృతికి బ్రేకప్ చెప్పేశానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా  పోస్ట్ పెట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. శృతి కూడా ఈ విష‌యాన్ని బ‌ల‌ప‌ర‌డంతో వీరి ప్రేమ‌క‌థ ముగిసిపోయింది.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు మంచు ఫ్యామిలీ. అలాంటి ఇంటి హీరో కూడా ఈ ఏడాది త‌న వివాహ బంధానికి ముగింపు ప‌ల‌క‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ణ‌తీరెడ్డిని ప్రేమించి ఆ త‌రువాత పెద్ద‌ల అంగీక‌రింతో పెళ్లి చేసుకున్నారు యంగ్ హీరో మంచు మ‌నోజ్. 2015 మే20 వీరి వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత నుంచి కెరీర్ ప‌రంగా మ‌నోజ్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తారా స్థాయికి చేర‌డంతో విడాకుల‌కు అప్లై చేసుకుని విడిపోయారు. ఈ టాపిక్ ఇంట‌స్ట్రీతో పాటు సామాన్య జ‌నాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగులో క్రేజీ హీయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఓ వ్య‌భిచార సంఘ‌ట‌న కార‌ణంగా వార్త‌ల్లో నిలిచి తెలుగులో కెరీర్‌ని నాశ‌నం చేసుకుంది. ఆ త‌రువాత త‌న మిత్రుడు, వ్యాపార వేత్త రోహిత్ మిట్ట‌ల్‌ని ప్రేమ వివాం చేసుకుంది. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ ఏడాది తిర‌క్కుండానే విడాకుల‌కు అప్లై చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఆస్ట్నేలియ‌న్ ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నిబోన్‌తో డేటింగ్ చేస్తూ వార్త‌ల్లో నిలిచిన ఇలియానా త‌న ప్రియుడితో క‌లిసి గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణాన్నిసోష‌ల్‌మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ర‌చ్చ చేసిన ఇలియానా ఉన్న‌ట్టుండి ఈ ఏడాదే ఆండ్రూనిబోన్ కి బ్రేక‌ప్ చెప్పేసి నెటిజ‌న్స్‌కి షాకిచ్చింది. ఇలా ఈ ఏడాది బ్రేప్‌ల‌తో షాకిచ్చిన ఈ జంట‌లు వ‌చ్చే ఏడాది కొత్త ప్రేమాయణాల‌కి తెర తీస్తారేమో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MDS2M6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...