మెగా హీరో రామ్‌చరణ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ మెగా హీరో వణ్య ప్రాణి సంరక్షణపై అవగాహనకల్పిస్తూ వాటి క్షేమం కోసం ఫండ్‌ని రైజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. `వైల్డెస్ట్ డ్రీమ్స్` పేరుతో ఇటీవల తను తీసిన ఫొటోలతో ప్రత్యేకంగా ఓ ఎగ్జిబిషన్‌ని రామ్చరణ్ కొత్త నివాసంలో ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొన్న చాలా మంది తారలు రామ్‌చరణ్ లోని ప్రవిభను మెచ్చి ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఈ మెగా హీరోకే తమిళ నటి పోటీకి వస్తోంది. రజనీకాంత్ నటించిన `పేట్టా`, విజయ్ నటిస్తున్న 64వ చిత్రంతో వార్తల్లో నిలిచిన మాళవికా మోహనన్ గత రెండేళ్లుగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చేస్తోందిట. ఇటీవల వెకేషన్ కోసం ఆఫ్రికా వెళ్లిన మాళవిక అక్కడి ఫారెస్ట్‌లోని వణ్య మృగాలని ప్రత్యేకంగా ఫొటోలు తీసిందట. వాటి జీవన విధానంతో పాటు అవి తీసుకునే ఆహారంపై కూడా దేశ వ్యాప్తంగా వున్న అడవుల్లో తిరిగి తెలుసుకున్నానని, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అంటే తనికి మహా సరదా అని, కాబిని, వయానాడ్, మాసినగుడి ఫారెస్ట్‌లలో ప్రత్యేకంగా తిరిగి అక్కడి వణ్య ప్రాణుల్ని నిశితంగా పరిశీలించానని చెబుతోంది.
ఆఫ్రికా పర్యటన తనకు థ్రిల్లింగ్‌గా అనిపించిందని, అక్కడ తను తీసిన ఫొటోలు భలే అందంగా వచ్చాయిని, తనకిదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని సోషల్ మీడియా ఇన్‌స్టా లో పేర్కొంది. ఈ సందర్బంగా తను తీసిన కొన్ని ఫొటోలని అభిమానులతో పంచుకుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/39rosDx
Shot on Sony A7R3 + Sony GM 100-400 + 1.4x TC
Comments
Post a Comment