1979లో ఏర్పడిన స్కైలాబ్ అప్పట్లో సంచలనం కలిగించింది. జనం అంతా ఎప్పుుడు ఏమౌతుందో అని భయంతో కాలం వెల్లదీశారు. ఆ సంఘటనల నేపథ్యంలో త్వరలో ఓ సినిమా తెలుగు తెరపైకి రాబోతోంది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్కైలాడ్ 79లో ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. స్కైలాబ్ అంశాన్ని ప్రధాన కథావస్తువుగా తీసుకుని పిరియాడిక్ మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో త్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అర్జున్‌రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రీ బ్యూట్ చేసిన కే ఎఫ్ సీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటరవుతోంది. విశ్వక్ కందేరావు ఈ సైంటిఫిక్ ఫిక్షన్ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. డా. రవికిరణ్ సమర్పణలో పృథ్వీ పిన్నమరాజు తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తుండగా, ఆదిత్య జవ్వాది ఛాయాగ్రహణం, రవితేజ గిరిజాల ఎడిటింగ్ అందించబోతున్నారు.
సరికొత్త నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది. చాలా రోజుల తరువాత నిత్యామీనన్ తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపైనే ఆమె ఆశలు పెట్టుకుందట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36ajitt
Comments
Post a Comment