టాలెంటెడ్ బ్యూటీ నివేద థామస్, తమిళ్, మలయాళంలో సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో జెంటిల్ మ్యాన్ సినిమాతో అరంగేట్రం చేసింది నివేద. తొలి సినిమాతోనే మంచి పెర్ఫార్మర్ అన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్ళీ నాని తోనే చేసిన నిన్ను కోరి పెద్ద హిట్టైంది. దీంతో ఆమెకు అవకాశాల వెల్లువ వస్తుందని అందరూ ఆశించారు. అయితే ఆశించినంత వేగంగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఆమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు సక్సెస్ లేక కనీసం యావరేజ్ గానైనా ఆడాయి. మరి ఎందుకని నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదో అర్ధం కాదు.
ఎన్టీఆర్ తో జై లవకుశలో ఒక హీరోయిన్ గా నటించింది నివేద. అది ఆమె కెరీర్ కు పెద్ద ఉపయోగపడింది లేదు. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ అనే ప్లాప్ సినిమాలో నటించినా వెంటనే 118, బ్రోచేవారెవరురా సినిమాలతో నటిగా మళ్ళీ తన స్థాయిని నిరూపించుకుంది. తన పాత్రకు ప్రాధాన్యముంటే తప్ప నటించడానికి ఒప్పుకోని నివేదకు ఇప్పుడు అవకాశాల వెల్లువ రావడం శుభపరిణామం. రజినీకాంత్ దర్బార్ లో ఒక కీలక పాత్ర చేసిన నివేద, తనను తెలుగు తెరకు పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో V సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పింక్ రీమేక్ లో నివేద ఒక హీరోయిన్ గా సెలక్ట్ అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో తాప్సి పోషించిన పాత్రను తెలుగులో నివేద పోషించనుంది. ఇదే కాకుండా ఇప్పుడు తమిళంలో మరో సినిమాలో కూడా సెలక్ట్ అయింది నివేద. సిద్ధార్థ్ హీరోగా ప్రస్తుతం టక్కర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. అదే నిర్మాతతో సిద్ధార్థ్ టక్కర్ కాకుండా మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. దాంట్లో హీరోయిన్ గా నివేద సెలక్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SwlbwK
Comments
Post a Comment