మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తర్వాతి నుండి బ్రేక్ తీసుకుంటున్నాడు. తర్వాత కొరటాల శివ సినిమా ప్రకటించినా రెగ్యులర్ షూట్ విషయంలో జాప్యం జరిగింది. దసరాకే ఈ చిత్ర ముహూర్తం జరిపినా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకపోవడంతో ఫిల్మ్ సర్కిల్స్ లో భిన్నమైన వార్తలు ప్రచారం కావడం మొదలైంది. అయితే మెగా ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే బయటకొచ్చిన వార్త ఏంటంటే.. ఈరోజు నుండి చిరంజీవి- కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలైంది.
కోకాపేటలో తొలి షెడ్యూల్ జరుపుతున్నారు. సంక్రాంతి వరకూ పెద్ద బ్రేక్స్ లేకుండా మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ తిరిగి షూటింగ్ ను మొదలుపెడతారు. వేసవికి ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాలని షెడ్యూల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే హాలిడే సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనీ భావిస్తున్నారు.
త్రిష ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లుగా సమాచారం. మణిశర్మ సంగీత దర్శకుడు. ఇప్పటికే మణిశర్మ, కొరటాల శివతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో సాంగ్స్ ను ప్రాధమికంగా ట్యూన్స్ ను ఫైనల్ చేసేసారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే క్లర్క్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారు.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరస హిట్స్ ఇచ్చిన కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZneMoI
Comments
Post a Comment