Skip to main content

పోనిలే ఇప్పటికైనా రష్మిక గుర్తొచ్చింది

పోనిలే ఇప్పటికైనా రష్మిక గుర్తొచ్చింది
పోనిలే ఇప్పటికైనా రష్మిక గుర్తొచ్చింది

రష్మిక మందన్న.. ఇప్పటిదాకా మిడ్ రేంజ్ హీరోలతోనే చేసుండొచ్చు కానీ ఆమెకున్న ఫాలోయింగ్ కథ వేరు. చేసినవి దాదాపుగా అన్నీ హిట్ సినిమాలే. తెలుగులో ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక, తర్వాత గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో ఆమె రేంజ్ మారిపోయింది. ఇక్కడ టాప్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీగా అవతరించింది. అయితే దేవదాస్ ఓ మోస్తరుగా ఆడినా మళ్ళీ విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ సినిమా నిరుత్సాహపరిచినా రష్మిక క్రేజ్ ఇక్కడ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రష్మికకు కన్నడలో కూడా క్రేజ్ ఎక్కువే. వారు కూడా ఆమె నటించే తెలుగు సినిమాలపై ఆసక్తి ప్రదర్శిస్తుంటారు.

రష్మికకు తొలిసారి టాప్ తెలుగు హీరో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశమొచ్చింది. దాని తర్వాత రష్మిక ఇప్పుడు టాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్. నితిన్ సరసన భీష్మ చేస్తోన్న రష్మిక, అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. మరిన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇలాంటి క్రేజ్ ఉన్న రష్మికను సరిలేరు టీమ్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్న వాదన ఈ మధ్య బాగా బలపడింది. రష్మిక మందన్నను సరిలేరు నీకెవ్వరు ప్రమోషనల్ మెటీరియల్ లో ఎక్కడా చోటివ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. సరిలేరు నీకెవ్వరు టీజర్ లో ఆమెకు చోటివ్వలేదు. మిగతా నటులందరినీ పరిచయం చేసి, రష్మికకు సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టకపోవడం ఏమిటని రష్మిక ఫ్యాన్స్ గుస్సా అయ్యారు కూడా. కనీసం ఇప్పటిదాకా విడుదలైన రెండు పాటల్లో కూడా ఎక్కడా రష్మిక ఊసే లేదు. దీంతో రష్మిక ఫ్యాన్స్ బాహాటంగానే ట్విట్టర్ లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు.

అయితే రష్మిక ఇప్పటికి టీమ్ కు గుర్తొచ్చిందో లేక ట్విట్టర్ లో ఈ అసంతృప్తిని గమనించారో కానీ మొత్తానికి రష్మికకు సంబంధించిన రెండు పోస్టర్లు విడుదల చేసారు. అయితే రష్మిక, మహేష్ మధ్య ఒక రొమాంటిక్ విజువల్ ఏదైనా విడుదల చేస్తారు అని ఆశించిన ఫ్యాన్స్ ఇప్పుడు పోస్టర్స్ తో సరిపెట్టడంతో మళ్ళీ అసంతృప్తిగానే ఉన్నారు. మరి సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తోందా? అన్నట్లు వచ్చే సోమవారం విడుదలయ్యే పాట రొమాంటిక్ డ్యూయట్ అంట. సో కచ్చితంగా, మహేష్, రష్మికకు సంబంధించిన మరిన్ని స్టిల్స్ బయటకు వస్తాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PbP4jC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...