`అర్జున్‌రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. సెన్సేషనల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న విజయ్ సోషల్ మీడియాలో ఏది చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తన క్రేజ్‌కి తగ్గట్టే సోషల్ మీడియాని వాడుకుంటుంటూ టాలీవుడ్ స్టార్‌లకే కాకుండా ఇతర ఇండస్ట్రీల వాళ్లకు దగ్గరవుతున్నారు. తాజాగా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొంత కాలంగా బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్‌సింగ్‌ని ఫాలో అవుతున్న ఈ రౌడీ హీరో తన ట్వీట్‌లతో బాలీవుడ్ స్టార్‌ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ రెమో డిసౌజా డ్యాన్స్ నేపథ్యంలో `ఏబీసీడీ` పేరుతో సిరీస్ చిత్రాల్ని రూపొందిస్తున్నారు. వీటికి బాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ వుంటోంది. తాజాగా ఆయన `స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ` పేరుతో ఓ సినిమాని రూపొందించారు. వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్ జంటగా నటించారు. ప్రభుదేవా, మురళీశర్మ, బాహుబలి ఫేం నోరా ఫతే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రీసెంటట్‌గా రిలీజ్ అయింది. ఇందులో వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయిన విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
`ఈ లైఫ్ టైమ్‌లో ఇలా నేను చేయలేను. సినిమాలో చూసి ఎంజాయ్ చేయటమే. అభినందనలు బ్రదర్` అంటూ వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్, ప్రభుదేవా, రెమోడిసౌజాలని ట్యాగ్ చేస్తూ అభినందనలు అందజేయడం ఆసక్తికరంగా మారింది. స్ట్రీట్ డ్యాన్స్ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
Ee life time lo idhi nenu cheyalenu, cinema lo chusi enjoy cheyatame
Wishing brother @Varun_dvn @ShraddhaKapoor @remodsouza @PDdancing and all the street dancers the very best for #StreetDancer3D
Releasing in Telugu on the 24th of Jan 2020. https://t.co/CTtA30ZPVx
— Vijay Deverakonda (@TheDeverakonda) December 19, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EAeAZH

Comments
Post a Comment