Skip to main content

సూపర్ స్టార్ సినిమా మాస్ కే బాస్ అంటున్నారే!

సూపర్ స్టార్ సినిమా మాస్ కే బాస్ అంటున్నారే!
సూపర్ స్టార్ సినిమా మాస్ కే బాస్ అంటున్నారే!

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఒకప్పుడు ఇక్కడి హీరోలతో సమానమైన మార్కెట్ ఉండేది. రజిని సినిమా వస్తోందంటే ఇక్కడ ఓ రేంజ్ లో హంగామా ఉండేది. ఓ రేంజ్ ఉన్న హీరోలు కూడా తమ సినిమాలని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన సినిమాలు ఇక్కడ 30 కోట్ల బిజినెస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రజినీకాంత్ కు రోబో తర్వాత సరైన హిట్ లేదు. మధ్యలో మరీ నాసిరకమైన సినిమాలు చేసాడు. కెరీర్ మొత్తం ఫ్యాన్స్ కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటివే చేసిన రజిని, రోబో తర్వాత ఎందుకో క్లాస్ సినిమాలు అంటూ కొత్త రాగం అందుకున్నాడు. కావాలని ఫైట్లు తగ్గించేయడం, తన మార్క్ మ్యానరిజమ్స్ ఏం పెట్టకపోవడం వంటివి చేసాడు. దాంతో రజిని ఫ్యాన్స్ సైతం నిరుత్సాహపడాల్సిన పరిస్థితి.

కబాలి, కాల సినిమాలతో ఎంతో నెగటివిటీ కూడా వచ్చింది. ఎందుకని రజిని ఫ్యాన్స్ మనసుని అర్ధం చేసుకోవట్లేదు అంటూ వారు ఆవేదన చెందారు. ఆ ఎఫెక్ట్ పేట చిత్రంపై గట్టిగా పడింది. ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ చాలా సాదాగా వచ్చాయి. తమిళంలో ఓ మాదిరి హిట్టైన పేట, తెలుగులో మాత్రం ప్లాపైంది. ఇలా వరసగా హిట్ అన్నదే లేకపోవడంతో రజినీ మార్కెట్ తెలుగులో బాగా దెబ్బతింది. పేట సినిమాకు సాదాసీదా బిజినెస్ చేసినా మొత్తం రికవర్ కాలేదు.

దాంతో దర్బార్ కు పరిస్థితి మరింత దిగజారింది. అసలు ఈ సినిమా సంక్రాంతికి వస్తోందన్న సందడే లేదు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను కాంపిటీషన్ గా కూడా తీసుకోవట్లేదు. అయితే దర్బార్ తో రజినీ, మురుగదాస్ కలిపి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రజనీ ఈసారి పూర్తి స్థాయి మాస్ మసాలా సినిమాను అందించబోతున్నాడట. మురుగదాస్ విషయమున్న దర్శకుడు. తన రీసెంట్ సినిమాలు అంత బాగా ఆడనంత మాత్రాన దర్బార్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. దర్బార్ పాటలు తమిళంలో విడుదలయ్యాయి. అవి పూర్తిగా మాస్ బీట్లతో మాస్ ప్రేక్షకులను అలరించేవిగా ఉన్నాయి. దీన్ని బట్టే రజినీ ఈసారి స్టైల్ మార్చాడని, ఈ సంక్రాంతికి దుమ్ము రేపడం ఖాయమని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P9sLLp

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...