`రంగస్థలం` చిత్రంతో రామ్‌చరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా రామలక్ష్మీ చిట్టిబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వివరాల్లోకి వెళితే…మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిన విషయం తెలిసిందే. వణ్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచ స్థాయిలో అవగాహణ కల్పిస్తూ నిధులు సేకరించడం కోసం రామ్‌చరణ్ ముందుకొచ్చారు. ఇందులో బాగంగా తన నివాసంతో `వైల్డెస్ట్ డ్రీమ్స్` పేరుతో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు.
ఈ ఎగ్జిబిషన్‌ని పలువురు సెలబ్రిటీలు వీక్షించేందుకు వచ్చి రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఫొటోలని సెలబ్రిటీలు సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన సమంత మాత్రం చిట్టిబాబు రామ్‌చరణ్‌ని ప్రత్యేకంగా అభినందించింది. రామ్‌చరణ్ తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోలని చూసి అభినందనలు తెలిపారు. అనంతరం రామ్‌చరణ్ దంపతులతో దిగిన ఫొటోలని ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీతో అద్భుతమైన సాయంత్రాన్ని మాకు అందించిన రామ్‌చరణ్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలని సమంత పొగడ్తల్లో ముంచెత్తగా, మంచు లక్ష్మీ కూడా అభినందించింది. డబ్ల్యూడబ్య్లూ ఎఫ్ కోసం ఫండ్ రైజ్ చేసిన మొట్టమొదటి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రామ్‌చరణ్ అని, చెర్రీలోని వినూత్న టాలెంట్లను చూడటం అద్భుతంగా వుందని, చెర్రీని చూస్తుంటే తనకెంతో గర్వంగా వుందని అభినందనలు తెలియజేసింది.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EGlCwb
Comments
Post a Comment