Skip to main content

అల వైకుంఠపురములో.. తన పాత సినిమాలనే మార్చి తీసేసాడా?

అల వైకుంఠపురములో.. తన పాత సినిమాలనే మార్చి తీసేసాడా?
అల వైకుంఠపురములో.. తన పాత సినిమాలనే మార్చి తీసేసాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో ముందు నుండీ అటు ట్రేడ్ పరంగా, ఇటు బజ్ పరంగా బోలెడంత సందడి చేస్తోంది. అసలు ప్రమోషన్స్ పరంగా కొత్త స్ట్రాటజీ ఫాలో అయిన అల వైకుంఠపురములో దాన్నుండి చాలా లాభపడింది. పోటీగా మహేష్ బాబు వంటి హీరో నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు ఉన్నా కానీ బజ్ ఎక్కువగా అల వైకుంఠపురములో చుట్టూ తిరుగుతోంది అంటే దానికి కారణం అల టీమ్ ఫాలో అయిన ప్రమోషనల్ స్ట్రాటజీ. ఈ సినిమాకు చాలా ముందు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ముందుగా సామజవరగమన, తర్వాత రాములో రాముల పాటలు విడుదల చేసారు. అవి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది. ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ వస్తే, మరో పాటకు 90 మిలియన్ వ్యూస్ దాటి వచ్చాయి. ఇప్పుడిక టీజర్ వంతు. అల వైకుంఠపురములో టీజర్ కూడా అన్ని రికార్డులను బ్రేక్ చేసేసింది. ఈ మధ్యనే విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ రికార్డులను చెరిపేస్తూ కేవలం 7 నిమిషాల్లోనే 1 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. ఇంకా 24 గంటలు కూడా కాకముందే ఈ టీజర్ 5 మిలియన్ వ్యూస్ దాటేశాయి.

ఈ టీజర్ కట్ అదీ స్టైలిష్ గా, త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తూ, అల్లు అర్జున్ చమక్కులతో ఉంది. ఇదంతా పక్కన పెడితే త్రివిక్రమ్ చెప్పాలనుకున్న స్టోరీ పాయింట్ కొత్తగా ఏం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక హిట్ ఫార్ములా ఉంది. అత్తారింటికి దారేది చిత్రంలో చిన్నప్పుడే అత్త ప్రేమానురాగాలకు దూరమైన మేనల్లుడు, ఆమెను వెత్తుకుంటూ వెళ్లి ఆ కుటుంబ పరిస్థితులను కూడా చక్కదిద్దుతాడు. అలాగే ఇక్కడ అల వైకుంఠపురములో నాన్న నుండి దూరంగా పెరిగిన హీరో.. పెద్దయ్యాక వైకుంఠాపురానికి వెళ్లి అక్కడున్న కుటుంబ పరిస్థితులను, ఆఫీస్ సమస్యలను తీరుస్తాడు. మధ్యలో బంధాలను, అనుబంధాలను మార్చినా కోర్ పాయింట్ అయితే ఇదే ఉంది. ఇంకా చూసుకుంటే అ.. ఆ చిత్రంలో కూడా అంతర్లీనంగా ఇదే పాయింట్ కనిపిస్తుంది. కాకపోతే ఇది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పడం వల్ల ఒక కొత్త యాంగిల్ వచ్చింది.

అజ్ఞాతవాసిలో కూడా చూసుకుంటే ఇదే ఫార్మాట్ కనిపిస్తుంది. చూస్తుంటే గురూజీ మోనోటినీ అవుతున్నాడేమో అనిపిస్తోంది. అయితే కథ పరంగా అలాగే ఉంచినా ట్రీట్మెంట్ లో చాలా తేడా ఉంటుందని, పైగా కథల విషయంలో అల్లు అర్జున్ ఆన్ ది స్పాట్ ఉంటాడు కాబట్టి ఈసారి గురూజీ గురి తప్పదనే ఆశిద్దాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34iJiRP

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...