`పాతాహే మై కోన్ హూ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్..` అంటూ వెండితెరపై ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి డమ్మీ గన్‌లతో హంగామా చేసిన ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో `రెడ్` రూపొందుతున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా చిత్రీకరణకు కొంత విరామం లభించడంతో హీరో రామ్ రియల్ గన్‌లతో హల్‌చల్ చేయడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రక్షణ దళాలు, పారామిలటరీ దళాలు వివిధ పోలీస్ శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47లని హైదరాబాద్‌లోని జెన్ టెక్నాలజీస్ సంస్థ సరఫరా చేస్తోంది. ఈ సంస్థ రజతోత్సవ కార్యక్రమానికి హీరో రామ్‌ని ఆహ్వానించారు. దీంతో రెచ్చిపోయిన రామ్ ఏకే 47ని చేతిలోకి తీసుకుని అక్కడ హల్‌చల్ చేశారు. ఒరిజినల్ గన్‌ని ఎలా వాడాలో, ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్ అవుతుందో వివరంగా తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఏకే 47తో షూట్ చేయాలంటే ఏ రేంజ్ వుండాలి. ఏ రేంజ్‌లో వాడాలనే వాటి గురించి కూడా రామ్ వివరాలు అడిగి తెలుసుకున్నారట. రామ్ ఆసక్తిని గమనించిన సదరు సంస్థ వారు వివరంగా ఏకే 47 వాడకాన్ని వివరించారట. ఆ తరువాత రామ్ పలు ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. అరుదైన అనుభవమిది. చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్‌గానూ వుందని, తనని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జెన్ టెక్నాలజీస్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రామ్.
Ram Pothineni’s tryst with a different kind of Shoot! @ramsayz was invited to 25th year Celebrations of Zen Technologies as the Chief Guest,at the Company’s Headquarters in Hyd.He Embraced the Rare Opportunity to Fire a .22 Rifle MG, AGL,ATGM,CTSR,AK47 used by the Indian Army. pic.twitter.com/1sBOM9TH6B
— BARaju (@baraju_SuperHit) December 23, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2s47iuU
Comments
Post a Comment