నిన్న సోషల్ మీడియాను ఊపేసిన ఒక న్యూస్.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావడమే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పటికే అధికారికంగా ప్రకటన ఇచ్చారు. జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహించనున్నట్లు ప్రకటించగా, నిన్ననే చిరంజీవి ఈ వేడుకకు రాబోతున్నట్లు తెలిపారు. స్వయంగా నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి వెళ్లి మెగాస్టార్ ను ఫంక్షన్ కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ కూడా చిరుకి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని చెప్పినట్లుగా వార్తలు ఉన్నాయి.
ఇక సూపర్ స్టార్ సినిమా వేడుకకు మెగాస్టార్ వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫ్యామిలీకే చెందిన స్టార్ హీరో కానీ, వారికి సన్నిహితంగా ఉండేవారు కానీ వెళుతుంటారు. కానీ రెండేళ్ల క్రితం భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ రావడం నిజంగా అప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడేమో చిరంజీవి ఈవెంట్ కు రానున్నారు. ఎప్పుడూ మెగాస్టార్, సూపర్ స్టార్ ఒక సినిమా వేదికపై కలిసింది లేదు. గతంలో రెండు, మూడు సార్లు ఏవో అవార్డు కార్యక్రమాలలో కనిపించారు. అలాగే ఒక ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ ఎప్పటికీ నెం 1 కుర్చీ మెగాస్టార్ దే అని చెప్పడం కూడా అప్పట్లో ఫ్యాన్స్ కు భలే కిక్కిచ్చింది. ఇలాంటి ఒక రెండు, మూడు సంఘటనలు తప్పిస్తే బయట ఎక్కడా వీరిద్దరూ కలిసింది లేదు. ఈ నేపథ్యంలో మహేష్ గురించి చిరంజీవి ఏం మాట్లాడనున్నాడా అని అందరూ ఆసక్తిగా ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు.
ఇదంతా ఒక కోణమైతే దీనికి మరో కోణం కూడా ఉంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పోటీగా బరిలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో కూడా ఉంది. మెగా హీరో సినిమాకి పోటీగా బరిలో ఉన్న సినిమా వేడుకకు మెగాస్టార్ హాజరవ్వడం ఏంటని కొంతమంది మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు కూడా. అయితే ఇందులో అంత లోతుగా ఆలోచించాల్సింది ఏం లేదని, మహేష్ అంటే చిరుకి ఎప్పుడూ అభిమానం ఉందని, స్వయంగా వాళ్ళు వచ్చి పిలవడంతో మెగాస్టార్ ఒప్పుకున్నాడని అంటున్నారు. కారణాలు ఏవైనా కానీ మెగాస్టార్ రాకతో సరిలేరు నీకెవ్వరు చిత్ర ఈవెంట్ మరింత స్పెషల్ గా మారనుండడం మాత్రం కచ్చితం.
Adding Grace & Style to the first & biggest celebration of 2020 !!#MegaStarChiranjeevi gaaru
will be gracing #SarileruNeekevvaru PreRelease Event on JAN 5th at LB Stadium
![]()
Gear up for the #MegaSuperEvent
#SarileruNeekevvaruOnJan11th pic.twitter.com/HEXycTr8Fs
— Sri Venkateswara Creations (@SVC_official) December 20, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ELPNBX
will be gracing


Comments
Post a Comment