మల్టీస్టారర్ కు ఉండే క్రేజ్ మాటల్లో వర్ణించలేనిది. రీసెంట్ గా విడుదలైన వెంకీ మామ చిత్రం దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తోంది. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోవడానికి ప్రధానం కారణం మల్టీ స్టారరే అనడానికి సందేహం అక్కర్లేదు. వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ కే రెస్పాన్స్ ఇలా ఉంటే.. ఇక క్రేజ్ లో వీరికంటే ఎక్కువలో ఉన్న మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ఈ కాంబినేషన్లలో ఏదైనా కాంబినేషన్ తో మల్టీ స్టారర్ సెట్ అయిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే చిరు-పవన్, చిరు-చరణ్, పవన్-చిరు కాంబినేషన్ లో సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. ఇకపై కూడా జరుగుతాయి.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం మాత్రం ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం సరైన స్క్రిప్ట్ లేకపోవడమే. ఇప్పటికే చిరంజీవి- పవన్ కళ్యాణ్ హీరోలుగా సినిమా చేయబోతున్నట్లు టిఎస్సార్, అశ్విని దత్ లాంటి వాళ్ళు అధికారిక ప్రకటన జారీ చేసారు. ఇక సినిమా తొందర్లోనే అన్నట్లుగా ఊదరగొట్టేసారు. అయితే అటువంటి ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. అవి ప్రకటనల రేంజ్ తోనే ఆగిపోయాయి. ఇవి మాత్రమే కాకూండా పవన్ కళ్యాణ్ నిర్మాతగా చరణ్ హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు ఒక వార్త అప్పట్లో హల్చల్ చేసింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. సరైన కథతో దర్శకులు ఎవరైనా వస్తే చరణ్ తో తాను సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అలాగే చరణ్ కూడా కథ నచ్చితే పవన్ తో సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమా చేస్తామని చెప్పాడు. ఇక చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా కూడా ఒక సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి.
అయితే వీటిలో ఏది జరగాలన్నా ముందుగా కావాల్సింది వారి ఇమేజ్ లకు సరిపోయే కథ. అదంటూ ఒకటి లాక్ అయిపోతే ఎలాంటి కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి అయినా మెగా కాంపౌండ్ సిద్ధంగా ఉంది. అందుకే అనేది మెగా కాంపౌండ్ లో స్క్రిప్ట్ లు కావలెను అని.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YUsgIh
Comments
Post a Comment