సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలకు ప్రతి విషయంలోనూ కాంపిటీషన్ వస్తోన్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలూ కూడా సంక్రాంతి సందర్భంగా ఒకరోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానుండగా, అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కాబోతోంది. ఇలా ఒకరోజు వ్యవధిలో రెండు పెద్ద చిత్రాలు విడుదల కానుండడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రాలపైనే ఎక్కువగా ఉంది. ఇక ఈ రెండు చిత్రాలు కూడా ప్రతి విషయంలో ఒక దాంతో ఒకటి పోటీ పడుతూ అటు ఫ్యాన్స్ కు, ఇటు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారాయి. రిలీజ్ డేట్ విషయంలోనే కాక, ప్రమోషనల్ యాక్టివిటీస్ పరంగా కూడా ఈ రెండు చిత్రాలూ పోటీ పడుతుండడం విశేషమే.
సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అయిన రోజునే అల వైకుంఠపురములో నుండి మూడో పాట విడుదలైన సంగతి తెల్సిందే. అలాగే సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి పాట మైండ్ బ్లాక్ వచ్చిన రోజే సామజవరగమన సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన కారణంగా ఫ్యాన్స్ కోసమంటూ ఒక వీడియోను విడుదల చేసారు. సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ సూర్యుడివో చంద్రుడివో రిలీజ్ అయిన రోజే, అల వైకుంఠపురములో నుండి ప్రీ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కానుంది. ఇలా రెండు సినిమాలూ ఒక దాంతో ఒకటి పోటీ పడుతూ అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.
చూస్తుంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా కొద్ది రోజుల గ్యాప్ లోనే ఉండే అవకాశముంది. రెండు ఈవెంట్లు కూడా జనవరి మొదటి వారంలోనే జరగనున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తారక్ ను ఆహ్వానించడం, తను వస్తానని చెప్పడం కూడా జరిగిపోయాయన్నది ఆ రూమర్ సారాంశం. ఈ న్యూస్ ఇంకా నిజమో కాదో తెలీదు. అయితే తారక్ తో బన్నీకి మంచి అనుబంధం ఉండడం, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేసి ఉండడం, మరో సినిమా చేయడానికి ఇద్దరూ కమిట్ అయిన నేపథ్యంలో తారక్ రావడం నిజమే అనుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, తారక్ అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళితే, మరో ఆర్ ఆర్ ఆర్ హీరో అయిన చరణ్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లనున్నారట. మహేష్, చరణ్ లకు కూడా మంచి అనుబంధం ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరూ వారి వారి ఫ్యామిలీస్ తో కలిసి హాలిడే ట్రిప్ కూడా వేసి వచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఫ్యామిలీస్ హైదరాబాద్ లో కలుసుకుంటూనే ఉంటాయి. మరోవైపు చరణ్ తో అనిల్ రావిపూడి కూడా టచ్ లోకి ఈ మధ్యనే వచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడు. అందుకే అనిల్ రావిపూడి అయితే బెస్ట్ అని ఈ మధ్యే అతనితో ఒక అరగంట పాటు మీట్ అయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే చరణ్ సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు హాజరుకానున్నాడని తెలుస్తోంది. అయితే ఒక పక్క మెగా హీరో అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ అవుతుంటే, తనకు పోటీగా వస్తోన్న మహేష్ ఈవెంట్ కు చరణ్ వెళతాడా అన్నది సందేహమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38swZW7
Comments
Post a Comment