Skip to main content

మళ్ళీ ఫుల్ బిజీ కానున్న సురేష్ ప్రొడక్షన్స్

Suresh productions planning more remakes
Suresh productions planning more remakes

టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు ఒక బ్రాండ్ వేల్యూ ఉంది. ఈ బ్యానర్ లో నుండి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన నమ్మకం ఉంటుంది. కనీసం యావరేజ్ సినిమా అయినా వస్తుందని, బ్యాడ్ సినిమాలు చాలా అరుదనే భావన ప్రజల్లో ఉంది. ఇప్పటిదాకా అలానే జరుగుతూ వస్తోంది కూడా. సినిమాల పరంగా ఎప్పుడూ రామానాయుడు కానీ సురేష్ బాబు కానీ గురి తప్పిన సంఘటనలు చాలా అరుదు. మంచి కథ లేకపోతే సినిమాలు తీయడం తగ్గించేస్తారేమో కానీ ఏదొకటి చేయాలనే భావన మాత్రం వారికుండదు.

గత కొంత కాలంగా సినిమాల నిర్మాణాన్ని తగ్గించేసిన సురేష్ ప్రొడక్షన్స్ మళ్ళీ సూపర్ బిజీ కానుంది. వచ్చే రెండేళ్లలో వరసగా సినిమాలను నిర్మించడానికి ఇప్పటినుండే ప్రణాళికలు వేసుకుంటోంది. అందులోనూ ఈ సంస్థ నుండి రీమేక్ సినిమాలే ఎక్కువ రానుండడం విశేషం. సురేష్ బాబు సేఫ్ ప్రాజెక్టుల వైపే గత కొంత కాలంగా మొగ్గు చూపుతున్నాడు. రీమేక్ అయితే రిస్క్ తక్కువ కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా రిలీజైన వెంకీ మామ సురేష్ బాబు అండ్ కో కు హ్యాపీ ప్రాజెక్టుగానే మిగలనుంది. ఈ సినిమా తొలి వీకెండ్ కుమ్మేసింది. దాదాపుగా 20 కోట్లకు పైనే ఇక్కడ వసూలయ్యాయి. ఇక వీక్ డేస్ లో ఓ మోస్తరుగా పెర్ఫార్మ్ చేసినా చాలు వెంకీ మామ సేఫ్ అయిపోయినట్లే. ఈ ఏడాది ఇప్పటికే ఓ బేబీ అంటూ ఒక రీమేక్ ను తెరకెక్కించి విజయవంతమయ్యారు సురేష్ అబూ అండ్ కో. ఇక ఇప్పుడు అసురన్ రీమేక్ పనులు కూడా మొదలయ్యాయి. ఇవి కాకుండా మరో నాలుగు రీమేక్ సినిమాల హక్కులు సురేష్ బాబు వద్ద ఉన్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సోను కి టిటు కి స్వీటీ, డ్రీమ్ గర్ల్ సినిమాల రీమేక్ హక్కులు సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. అలాగే ఓ బేబీ కొరియన్ రీమేక్ కాబట్టి ఆ సినిమా విజయవంతమయ్యాక మరో రెండు కొరియన్ సినిమాల హక్కుల్ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ రీమేక్స్ కాకూండా రానాతో 200 కోట్ల బడ్జెట్ తో హిరణ్యకశ్యప అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న విషయం తెల్సిందే. మొత్తంగా వచ్చే రెండేళ్లలో సురేష్ ప్రొడక్షన్స్ నుండి మరిన్ని చిత్రాలు రానున్నాయన్నమాట.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LXlTyK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...