Skip to main content

వెంకీ మామ మూవీ రివ్యూ

వెంకీ మామ మూవీ రివ్యూ
వెంకీ మామ మూవీ రివ్యూ

నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్, నాజర్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం: బాబీ
నిర్మాత: సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్ ఎస్
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2019
రేటింగ్: 3/5

వెంకీ మామ రిలీజ్ విషయంలో సురేష్ బాబు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పాడు. ఒక సినిమాకి రిలీజ్ డేట్ ఎంత ముఖ్యమో సురేష్ బాబుకు బాగా తెలుసు. అయినా వేరే ఆప్షన్ లేకపోవడంతో డిసెంబర్ 13న అంటే ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రియల్ లైఫ్ లో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య వెంకీ మామలో అవే పాత్రలు పోషించడంతో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని వెంకీ మామ అందుకుందో లేదో చూద్దామా.

కథ:
కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా సింపుల్. రామ నారాయణ (నాజర్) ఒక ఊరికి పెద్ద మనిషి. అలాగే జాతకాల మీద పట్టున్న వ్యక్తి. తన మనవడు కార్తీక్ (నాగ చైతన్య), తన కూతురు, అల్లుడు చావుకి అని నమ్ముతాడు రామ నారాయణ. దీంతో తల్లిదండ్రుల్లేని కార్తీక్ బాధ్యతలను తన మావయ్య (వెంకటేష్) తీసుకుంటాడు. తన మావయ్య దగ్గరే పెరిగి పెద్దవాడైన కార్తీక్, ఉన్నట్లుండి తన మావయ్యను వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు తన మావయ్య నుండి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు? ప్రాణంగా పెంచుకున్న ఆ మావయ్య ఏం చేసాడు? అన్నది మిగతా కథ.

నటీనటులు:
ఈ సినిమా ఇంటర్వూస్ లో నాగ చైతన్య ఒక మాట చెప్పాడు. ఇందులో వెంకటేష్ మెయిన్ హీరో, నేను సపోర్టింగ్ క్యారెక్టర్ చేసానంతేనని. అప్పుడు ఏదో వినయంగా ఆ మాట చెప్పదనుకున్నాం కానీ అదే నిజం. ఇది పూర్తిగా వెంకీ సినిమానే. వెంకీ బలాల్ని నమ్ముకుని దర్శకుడు తీర్చిదిద్దిన సినిమా. వెంకటేష్ పైనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి పాత్రల్ని ఎన్నో చేసేసిన వెంకీ, ఈ పాత్రను కూడా అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్ని షేడ్స్ ను ది బెస్ట్ గా ప్రాజెక్ట్ చేసాడు. నాగ చైతన్యకు కొంచెం తక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్ర వచ్చినా కూడా అతను మెప్పించాడు. నటుడిగా ప్రూవ్ చేసుకునే స్కోప్ దొరక్కపోయినా తనకు వచ్చినదాంట్లో నిరాశపరచలేదు. ముఖ్యంగా వెంకటేష్, నాగ చైతన్య కెమిస్ట్రీ అదిరిపోయింది. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లకు దక్కిన పాత్రలు చెప్పుకునేంత గొప్పవి, పెద్దవి కావు. గ్లామర్ ఎడిషన్ కోసం ఉన్నారనిపిస్తుంది. ఆ రకంగా అయితే పూర్తి న్యాయం చేసారు. సీనియర్లైన నాజర్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తమకలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:
ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్మీ సెటప్ లోని విజువల్స్ అదిరిపోయాయి. ఇక విలేజ్ సెటప్ ను కూడా బాగా చూపించారు. ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరించిన విధానం బాగుంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పాటలు వినడానికి ఓకే. ఒకట్రెండు పాటలు తప్ప మిగతావి యావరేజ్ గానే అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు వంక పెట్టడానికి లేదు. తన స్టైల్ లో దుమ్ము దులిపాడు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా ఇంకా బెటర్ జాబ్ చేసి ఉండొచ్చనిపిస్తుంది. చాలా చోట్ల సీన్స్ లాగ్ ఉన్నాయి. కథ చాలా ముతకది. పోనీ కథనం అయినా కొత్తగా ఉందా అంటే దాని ట్రీట్మెంట్ ఇంకా పాతకాలం నాటిది. బాబీ సినిమాల్లో మనకు ముందు నుండి ఉండే కంప్లైంట్ ఇదే. అటు పవర్ కానీ, ఇటు జై లవకుశ కానీ చాలా ఓల్డ్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. వెంకీ మామకు ఇదే ప్రాబ్లెమ్ వెంటాడింది.

చివరిగా:
ట్రీట్మెంట్ ఓల్డ్ స్టైల్ అయినా కూడా కమర్షియల్ గా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వెంకటేష్, నాగ చైతన్య స్క్రీన్ పై కనిపించినప్పుడు అటు ఫ్యాన్స్ కు ఇటు ప్రేక్షకులకు కనులపండువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే సాగినా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ తో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ ను ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉండాల్సింది. ఇక్కడ సెంటిమెంట్ బానే పండినా లాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. మళ్ళీ క్లైమాక్స్ మంచి హై తో ముగియడం ఈ చిత్రానికి ప్లస్. రొటీన్ స్టోరీ, ట్రీట్మెంట్ ను పక్కనపెట్టేస్తే.. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా థియేటర్లకు వచ్చింది. సినిమాలకు మొహం వాచిపోయి ఉన్న ప్రేక్షకులకు ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ వెంకీ మామ.

పంచ్ లైన్: వెంకీ మామ – రొటీనే అయినా ఒకసారి చూడవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RKupVs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...