చందమమా కాజల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. గత దశాబ్ద కాలానికి పైగా కాజల్ తనదైన మార్కు చిత్రాలతో ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా ఓ వెలుగు వెళిగిన చందమామ జోరు కాస్త ఈ మధ్య తగ్గింది. ఇటీవల నటించిన చిత్రాల్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో కెరీర్ పరంగా కొంత వెనకబడింది కాజల్ అగర్వాల్. అయితేనేం ఆమె చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. తమిళంలో నటించిన `పారిస్ పారిస్` సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
ఆ సినిమా విషయం పక్కన పెడితే ప్రస్తుతం కాజల్ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న `మోసగాళ్లు`, హిందీ చిత్రం `ముంబై సాగా`తో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న `ఇండియన్ 2`లో నటిస్తోంది. ఇలా వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపేస్తూ క్షణం తీరిక లేకుండా వున్న కాజల్ కు ఈ మధ్య చిన్న బ్రేక్ దొరికింది. దాంతో తన ఫ్యామిలీతో కలిసి మల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడి అందాలని ఆస్వాదిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసింది.
దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తరువాత తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలో పాల్గొనడంతో కాజల్ ఆనందానికి హద్దే లేకుండా పోయిందని, కాజల్‌కు ఫ్యామిలీ అంటే ప్రాణం. అందుకే చాలా సందర్భాల్లో తన ఫ్యామిలీ వల్లే సినిమాల్లో ఇంత కాలం నటించగలిగానని, తనకు వారు ఓ కవచంలా నిలిచారని చెబుతుండేదని ఇప్పుడు అదే ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా విహార యాత్రని ప్లాన్ చేయడం కాజల్‌కు అమితానందాన్ని కలిగించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35E9GH4
Comments
Post a Comment